Homeఆంధ్రప్రదేశ్‌AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. స్వరూపాలు.. అతిచిన్న జిల్లాకు ‘పర్యాటకం’ దూరం

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. స్వరూపాలు.. అతిచిన్న జిల్లాకు ‘పర్యాటకం’ దూరం

AP New Districts:  ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు 13గా ఉన్న జిల్లాలు ఇక నుంచి 26 గా రూపాంతరం కానున్నాయి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవనుంది. అయితే కొత్త జిల్లాలుగా ఏర్పడిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న జిల్లాల రూపురేఖలు మారిపోయాయి. పునర్వవస్థీకరణలో భాగంగా కొన్ని మండలాలు, నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లాగా ఏర్పడడంతో ఇప్పటి వరకు ఉన్న ప్రధాన జిల్లాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందులో భాగంగా ఏపీలోని ప్రధాన జిల్లాల్లో ఒక్కటైన విశాఖపట్నం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మండలాలు, ఏజెన్సీ ప్రాంతాలు కలిగిన విశాఖ ఇప్పుడు కేవలం అర్భన్ ప్రాంతాలను మాత్రమే కలిగి రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా మారిపోయింది.

AP New Districts
AP New Districts

బంగాళాఖాతం సముద్రాన్ని ఆనుకొని ఉన్న విశాఖపట్నం జిల్లా 1804లో మద్రాసు ప్రెసిడెన్సీ లో ఒక జిల్లాగా ఏర్పడింది. ఆ తరువాత 1950 ఆగస్టు 15న ఈ జిల్లాలోని కొంత భాగం శ్రీకాకుళం జిల్లాగా అవతరించింది. ఇంకొంత భాగం 1979 జూన్ 1న విజయనగరం జిల్లాగా మారింది. 11,161 కిలోమీటర్ల సాంద్రత కలిగిన ఈ జి్లాల్లో 48 లక్షల జనాభాను కలిగి ఉంది. ఉత్తరాన ఒడిశా రాష్ట్రం, విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. బౌద్ధమతం ఎక్కువగా ప్రారుర్యం పొందిన ఈ జిల్లాలో వారికి గుర్తుగా బొజ్జన కొండ, శంకరము, తొట్ల కొండ ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. పట్టణ స్థాయి నుంచి మహానగరంగా అభివృద్ధి చెందిన విశాఖలో సముద్రతీరం ఉన్నందున పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. ఇక్కడి రుషికొండ, రామకృష్ణ బీచ్, భీముని పట్టణం లాంటివి ప్రసిద్ధి చెందాయి. 43 రెవెన్యూ డివిజన్లు, 15 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నాయి.

Also Read: MLA Roja: మాట నెగ్గించుకున్న ఎమ్మెల్యే రోజా

అయితే ఇప్పుడు విశాఖ జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోయింది. జిల్లాల పునర్వవ్యవస్థకీరణలో భాగంగా రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా మారనుంది. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వెళ్లగా కేవలం అర్భన్ ప్రాంతాలు మాత్రమే విశాఖకు దక్కాయి. వీటిలో భీమునిపట్నం, విశాఖ రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉన్నాయి. భీముని పట్నం పరిధిలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ రూరల్, సీతమ్మధార మండలాలు ఉండగా.. విశాఖ పట్నం పరిధిలో గాజువాక, పెందుర్తి, మహారాణిపేట, ములగాడ, పెద గంటాడ, గోపాలపట్నం ఆరు మండలాలు ఉన్నాయి. ఇక జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా 6కే పరిమితం అయ్యాయి. వాటిలో విశాఖ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, భీమిలి, గాజువాఖ సహా అన్ని నియోజకవర్గాలు నగర పరిధిలోనే ఉన్నాయి. ఏపీలో రెండో అతి ప్రధాన జిల్లాగా కొనసాగిన విశాఖ వాసులకు ఇప్పుడు అతి చిన్న జిల్లాగా విశాఖ మారడం ఇక్కడి ప్రజలకు మింగుడు పడడం లేదు.

AP New Districts
AP New Districts

 

విశాఖ జిల్లా అనగానే పర్యాటక ప్రాంతంగా చెప్పుకుంటారు. కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇప్పుడు విశాఖ వాటిని కోల్పోయింది. అరకు, పాడేరు వంటి ప్రాంతాలు దూరమయ్యాయి. ఇప్పటి వరకు 60 లక్షల జనాభా ఉన్న విశాఖ ఇప్పుడు 18 లక్షలకు కుదించుకుపోయింది. ఇక 11 వేల కిలోమీటర్ల సాంద్రత నుంచి 928 కిలోమీటర్లకు తగ్గింది. మెట్ట ప్రాంతాలు, నదీ మైదానం, కొండలలతో కళకళలాడే విశాఖ జిల్లాలో ఇప్పడు అవేమీ కనిపించే అవకాశం లేదు. ఇప్పుడు విశాఖ కేవలం చిన్న జిల్లాగానే భావించాలి. ఇదిలా ఉండగా ఏపీ రాజధానుల్లో ఒకటిగా పేర్కొన్న ఈ జిల్లా రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:KCR vs Modi: ఢిల్లీ వేదికగా కేసీఆర్ పోరాటం ఫలిస్తుందా?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

  1. […] KCR Delhi Tour: మొన్న సడన్ గా కేసీఆర్ ఢిల్లీ టూర్ అంటూ ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో గానీ చివరి నిమిషంలో క్యాన్సల్ అయిపోయింది. కేసీఆర్ ప్రగతి భవన్ లోనే ఉండిపోయారు. అప్పుడు కేసీఆర్ ప్రధాని అపాయింట్మెంట్ కోసమే ప్రయత్నించారని గుసగుసలు వినిపించాయి. కానీ వీలు పడకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. కాగా ఇప్పుడు కేసీఆర్ మరోసారి కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. […]

Comments are closed.

Exit mobile version