Homeఎంటర్టైన్మెంట్Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ : బన్నీ అభిమాని అవుట్

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ : బన్నీ అభిమాని అవుట్

Telugu Indian Idol:  దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మ్యూజిక్ షో.. ఇండియన్ ఐడల్. ప్రస్తుతం ఈ షో తెలుగులో కూడా విపరీతంగా అలరిస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారం అవుతున్న ఈ తెలుగు షో రోజు రోజూకీ ప్రేక్షకాధరణ మరింత పెరుగుతోంది. అత్యుత్త‌మ‌మైన తెలుగు గాత్రాన్ని క‌నుగొనే ఉద్దేశంతో ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ స్జేజ్ ప్రోగ్రామ్ గా ఈ షోను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది.

Telugu Indian Idol
Telugu Indian Idol

ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో కాంపిటీష‌న్ చాలా స‌వాళుతో కూడుకున్నది. ఆడియెన్స్ ద‌గ్గ‌ర నుంచి ఓటింగ్ సంపాదించుకున్న వారు పోటీలో నిలిచారు. ఇంతకీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లో నిలిచింది ఎవరు ? వాళ్ళల్లో ఎలిమినేట్ అయ్యింది ఎవ్వరో చూద్దాం.

Also Read: Karan Johar: సౌత్ సత్తాను క్యాష్ చేసుకుంటున్న కరణ్ జోహార్

మొత్తానికి ఉగాది స్పెషల్ ఎపిసోడ్.. ఈ సీజన్ మొదటి ఎలిమినేషన్‌కు సాక్ష్యంగా నిలిచింది. 12 మందిలో, ప్రదర్శనలో ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లో నిలవాల్సి వచ్చింది. వాళ్ళు ఎవరు అంటే…

1. మాన్య

2. జాస్కరన్ సింగ్

3. మారుతి

Telugu Indian Idol
Telugu Indian Idol

తక్కువ ఓట్లుతో అండ్ తక్కువ స్కోర్ తో ఎలిమినేషన్ లిస్ట్ లో చేరిన ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా ? అని ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూశారు. అయితే.. చాలా సస్పెన్స్ తర్వాత జాస్కరన్ సింగ్ ఎలిమినేట్ అయ్యాడు.

జాస్కరన్ సింగ్ .. అల్లు అర్జున్ కి పెద్ద అభిమాని. ఈ సింగింగ్ షో నుంచి అతను ఎలిమినేట్ అవ్వడం ప్రేక్షకులను కూడా నిరుత్సాహపరిచింది. నిజానికి జాస్కరన్ సింగ్ షోలో కంటిన్యూ చేయలేకపోవచ్చు. కానీ అతని పట్టుదలను కచ్చితంగా మెచ్చుకోవాలి. అతను పాటలను పాడే విధానం.. పాట కోసం అతను పడే శ్రమ, తపన చాలా గొప్పవి.

Telugu Indian Idol
Telugu Indian Idol

జాస్కరన్ సింగ్ పడుతున్న కష్టాన్ని చూసి.. గెలిచే కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఇతను కూడా ఒకడు అనుకున్నారు. కానీ.. అతను ఇలా మధ్యలోనే వెళ్లిపోవడం అతనికే కాదు, అతని పాటలను ఇష్టపడిన ప్రేక్షకులకు నిరాశను కలిగించింది.

Also Read:Casting Call For Prabhas New Movie: ప్రభాస్ తో నటించాలనుందా ? ఐతే.. ఇది మీ కోసమే

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version