UCC – Modi : అందరికీ ఒకే చట్టంపై మోడీకి మద్దతుగా ముస్లిం మహిళలు

అందరికీ ఒకే చట్టంపై మోడీకి మద్దతుగా ముస్లిం మహిళలు ముందుకొస్తున్నారు. యూసీసీపై ప్రతిపక్షాలు, పలువుి తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.. 

Written By: NARESH, Updated On : July 20, 2023 1:44 pm
Follow us on

UCC – Modi : ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) పై ప్రతిపక్షాల వైఖరి.. ఆలోచనలు చూస్తుంటే నవ్వు వస్తోంది. స్వాతంత్య్రానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదిస్తే మల్లగుల్లాలు పడీ చివరకు మద్దతు ఇచ్చారు.

ప్రజలందరూ కలిసి ఉండకుండా మాకు సపరేట్ గా నియోజకవర్గాలు కావాలని.. అదీ మాకు జనాభాతో సంబంధం లేకుండా ఎక్కువగా కావాలని నాడు ముస్లింలు డిమాండ్ చేశారు. దానికి మద్దతు తెలిపింది నాడు బీజేపీ మాత్రమే. స్వాతంత్రోద్యమానికి మద్దతు ఇస్తారనే పేరుతో కిలాఫత్ ఉద్యమాన్ని సపోర్టు చేసింది గాంధీజీ కాంగ్రెస్ పార్టీ.

మహాత్మా గాంధీ అయినా ఎవ్వరైనా తప్పు జరిగినప్పుడు దాన్ని తప్పు అనే ఖండించాలి. గాంధీ నాడు చేసింది ముమ్మాటికీ తప్పే. మలబారులో జరిగిన ఘోర కృత్యాలను సమర్థించడం అంతకన్నా తప్పే. ఇవే దేశంలో బీజాలు మొలకెత్తి దేశ విభజనకు దారితీశాయి. చివరకు అంత జరిగినా కాంగ్రెస్ పార్టీకి బుద్ది రాలేదు.

రాజ్యాంగ సభలో యూసీసీపై చర్చ జరగాలి. అంబేద్కర్ పట్టుబట్టగా.. నెహ్రూ కూడా పట్టుపట్టారు. నాడు మద్రాస్ ప్రావిన్సులో ముస్లిం లీగ్ పార్టీ అన్ని ముస్లిం నియోజకవర్గాల్లో ఏకపక్షంగా గెలిచారు. దేశాన్ని విభజించాలని డిమాండ్ చేశారు. యూసీసీ వద్దు అంటూ వాళ్లు డిమాండ్ చేశారు.

అందరికీ ఒకే చట్టంపై మోడీకి మద్దతుగా ముస్లిం మహిళలు ముందుకొస్తున్నారు. యూసీసీపై ప్రతిపక్షాలు, పలువురి తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..