https://oktelugu.com/

S. S. Rajamouli : దర్శకుడు రాజమౌళి కల నెరవేరింది… వీడియో షేర్ చేసిన గ్లోబల్ డైరెక్టర్

మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న రాజమౌళి అందుకు అనుభవం కావాలన్నారు. అలాగే మూడు నాలుగు భాగాలుగా తెరకెక్కిస్తేనే న్యాయం చేయగలమన్నారు. కాబట్టి రాజమౌళి ఓ పదేళ్ల సమయం ఈ ప్రాజెక్ట్ కి కేటాయించవచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : July 11, 2023 8:00 pm
    Follow us on

    S. S. Rajamouli : దర్శకుడు రాజమౌళి తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆయనకు ఎప్పటి నుండో రోడ్ ట్రిప్ లో సెంట్రల్ తమిళనాడు సందర్శించాలని ఉండేదట. ఆ కోరిక కూతురు కారణంగా తీరిందట. రాజమౌళి కూతురు తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను సందర్శిద్దామని కోరిందట. తమిళనాడు ప్రసిద్ధ ఆలయాలకు నెలవై ఉంది. రాజమౌళి కుటుంబం శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణదుకథన్, తూత్తుకుడి, మదురై పుణ్యక్షేత్రాలను సందర్శించారట. ఆ దేవాలయాల నిర్మాణ శైలి, నైపుణ్యం గురించి రాజమౌళి ప్రత్యేకంగా తన ట్వీట్లో ప్రస్తావించారు.

    ఇక ఈ ట్రిప్ లో రాజమౌళి మూడు కేజీలు పెరిగారట. విదేశీ టూర్స్ అనంతరం ఇదే లాంగ్ ట్రిప్ అంటున్నారు. రాజమౌళి ట్వీట్ పై నెటిజెన్స్ తమదైన అభిప్రాయం తెలియజేస్తున్నారు. కాగా రాజమౌళి నెక్స్ట్ హీరో మహేష్ బాబుతో మూవీ చేయనున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని సమాచారం. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా. రాజమౌళి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

    రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేష్-రాజమౌళి మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ కి మించి ఉంటుందని వెల్లడించారు. ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ పై కూడా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడటం విశేషం. మహేష్ మూవీ అనంతరం ఆర్ ఆర్ ఆర్ 2 ఉంటుంది. అయితే రాజమౌళి దర్శకత్వం వహిస్తాడని ఖచ్చితంగా చెప్పలేను. ఆయన పర్యవేక్షణలో మరొక డైరెక్టర్ ప్రాజెక్ట్ చేయవచ్చని అన్నారు.

    దానికి కారణాలు వెల్లడిస్తూ రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి రాజమౌళి మహాభారతం చిత్ర స్క్రిప్ట్ పనుల్లో బిజీ కావచ్చని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ మాటలను బట్టి రానున్న రెండు మూడేళ్లలో మహాభారతం ప్రాజెక్ట్ కి రాజమౌళి శ్రీకారం చుట్టే ఆస్కారం ఉంది. మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న రాజమౌళి అందుకు అనుభవం కావాలన్నారు. అలాగే మూడు నాలుగు భాగాలుగా తెరకెక్కిస్తేనే న్యాయం చేయగలమన్నారు. కాబట్టి రాజమౌళి ఓ పదేళ్ల సమయం ఈ ప్రాజెక్ట్ కి కేటాయించవచ్చు.