Munugodu By-poll Result : రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిరేపిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల విజేత ఎవరో కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. నెలరోజుల ఉత్కంఠకు తెరపడబోతోంది. ఉప ఎన్నికల్లో గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీ ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ ఆశతో ఉంది. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువుడుతున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో మొదట పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించారు.

మునుగోడులో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. వెయ్యికి పైగా ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.
పోస్టల్ బ్యాలెట్ లో మొత్తం 686 ఓట్లు.. 6సర్వీసు ఓటర్లు.. మొత్తం 692 ఓట్లు ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థికి 4 ఓట్ల ఆధిక్యం లభించింది. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ కు 228 ఓట్లు రాగా.. బీజేపీకి 224, బీఎస్పీ అభ్యర్థికి 10 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
పోస్టల్ బ్యాలెట్ ను ప్రధానంగా ఉద్యోగులు, వృద్ధులు, ఇతర శాఖల్లో పనిచేస్తూ డైరెక్ట్ గా ఓటు వేయలేని వారు వేస్తుంటారు. ఇది మొత్తం డబ్బులతో కొనుగోలు వ్యవహారంగా ఉంటుంది. టీఆర్ఎస్ పై ఉద్యోగుల్లో అంత వ్యతిరేకత ఉన్నా కూడా పోస్టల్ ఓట్లలో స్వల్ప మెజార్టీ సాధించడం విశేషంగా చెప్పొచ్చు.
ఇక తొలి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 2వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించిడం విశేషం. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 6069 ఓట్లు రాగా.. బీజేపీకి 4904 ఓట్లు, కాంగ్రెస్ కు 1887 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ లోనే టీఆర్ఎస్ ఏకంగా 1192 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా గులాబీ దండు మునుగోడులో పోటీనిస్తోంది. అయితే బీజేపీ కూడా బాగానే ఫైట్ ఇస్తోంది.