Bigg Boss 6 Telugu : ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో జరగకూడనివి ఎన్నో జరగినాయి..చూడకూడనివి ఎన్నో మనం చూసాము..బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్కుని ఇంటి సభ్యులందరు అద్భుతంగా ఆడారు కానీ..అందరూ కాకమీద ఉండేలోపు నోర్లు అదుపులో పెట్టుకోలేకపోయారు..అలాంటి ఇంటి సభ్యులలలో ఒకరు ఇనాయ సుల్తానా..నిజానికి ఈమె పోయినవారం ఒక ఆడపులి లాగానే టాస్కులను ఆడింది..ఫిజికల్ టాస్కులలో అయితే ఈమె మగవాళ్ళని సైతం బాహ్యాపెట్టేసింది.

కానీ యుద్దవాతావరణం ని తలపించిన కెప్టెన్సీ టాస్కు సెగ లో ఇనాయ సుల్తానా నోరు జారీ శ్రీహాన్ – శ్రీ సత్య ని అన్న ఒకమాట సోషల్ మీడియా లో పెద్ద చర్చ కి దారి తీసింది..ఇదే విషయాన్నీ ఈరోజు అక్కినేని నాగార్జున కూడా ప్రేక్షకులందరి దృష్టికి తీసుకొచ్చాడు..బాటన్ తో ఒకరిని ఒకరు తోసుకునే టాస్కులో శ్రీహాన్ మరియు ఇనాయ మధ్య మాట మాట పెరిగినప్పుడు శ్రీహాన్ ఇనాయ తో ‘నామినేషన్స్ లో తప్ప కంటెంట్ ఇవ్వడం చేతకాని నువ్వు కూడా నన్ను అంటున్నావా ఇనాయ’ అని అనడం మన అందరికి గుర్తు ఉండేఉంటుంది.
అప్పుడు ఇనాయ కి కోపం వచ్చి ‘నువ్వు భలే ఇస్తున్నావ్ లే కంటెంట్..ఈమధ్య నువ్వు ఎక్కడకి వెళ్లి పాడుకుంటున్నావో చూస్తున్నాం’ అని అంటుంది..వాస్తవానికి ఇది చాలా పెద్ద మాట అనే చెప్పొచ్చు..టాస్కు అయిపోయిన తర్వాత శ్రీహాన్ మరియు శ్రీసత్య ఇనాయ తో ఈ విషయంపై గొడవలు కూడా పెట్టుకున్నారు..’అది నోరా..పెంటా’ అంటూ శ్రీహాన్ ఇనాయ ని తిడుతాడు..ఇప్పుడు వీకెండ్ లో నాగార్జున గారు అదే విషయాన్నీ బయటకి తీసి అడుగుతాడు..నువ్వు అది ఏ ఉద్దేశ్యం తో అన్నావు అని అడుగుతాడు నాగార్జున..బాలాదిత్య అన్న విషయం లో జరిగిన దానిని బేస్ చేసుకొని అన్నాను అని అంటుంది ఇనాయ.
అప్పుడు నాగార్జున ఇనాయ అన్న మాటని అందరికి వీడియో ద్వారా చూపిస్తాడు..’ఇప్పుడు చెప్పు..ఇది నువ్వు ఏ ఉద్దేశ్యం తో అన్నావు’ అని అడుగుతాడు..అప్పుడు ఇనాయ తప్పు ఒప్పుకొని శ్రీ సత్య కి క్షమాపణలు చెప్తుంది..అంతే కాకుండా ఫుడ్ విషయం లో ఇనాయ పూటకి ఒక మాట మార్చడం..దాని వల్ల ఫుడ్ బాగా వేస్ట్ అవ్వడంపై కూడా నాగార్జున గారు ఫైర్ అయ్యారు.