Mudragada Padmanabham vs Pawan Kalyan : అనుకున్నంత అయ్యింది. ఇదేదో కొత్త విషయం కాదు. జరుగుతున్నదని ఊహించిందే.. జగన్ మోహన్ రెడ్డి అమ్ముల పొదిలోని అస్త్రాలన్నింటిని ఒక్కొక్కటి బయటకు తీస్తున్నాడు. అందులోని చివరిదే ముద్రగడ పద్మనాభం.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టారు ముద్రగడ. కాపుల్లో ఉన్న ఆకాంక్షను రగులుస్తూ సాగిన ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా కాపులు మద్దతు పలికారు. ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లడంలో ముద్రగడ సక్సెస్ అయ్యారు. నాటి విపక్షంగా వైసీపీ సైతం పరోక్షంగా సాయం చేయడంతో ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తునిలో విధ్వంసానికి దారితీసింది.దీంతో కాపులు టీడీపీకి వ్యతిరేకంగా మారిపోయారు. వైసీపీకి దగ్గరయ్యారు. ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీకి ఓటువేసి గెలిపించారు.
తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమాన్ని బంద్ చేసి ముద్రగడ ఇంట్లో కూర్చున్నారు. ఉద్యమాన్ని శంకించారంటూ కారణం చెప్పి ఇంటికే పరిమితమయ్యారు. అనుకున్నట్టు వైసీపీ సర్కారు వచ్చింది కాబట్టే ముద్రగడ ఉద్యమం నుంచి తప్పుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.
గత నాలుగేళ్లుగా జగన్ తీసుకున్న నిర్ణయాలను మెచ్చుకుంటూ ముద్రగడ లేఖలు రాసేవారు. ఇలా కాలం గడుపుతూ వస్తున్న ఆయనకు వైసీపీలో చేర్పించేందుకు జగన్ మొగ్గుచూపారు. కాపులు వ్యతిరేకమవుతున్న దృష్ట్యా కనీసం ముద్రగడను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల వైసీపీ కాపు అగ్రనేతలు ముద్రగడ వద్దకు వెళ్లి క్యూకట్టారు. పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ వస్తే ఎమ్మెల్యే.. ఆపై మంత్రి పదవి. కుమారుడు వస్తే ఎమ్మెల్యే పదవి ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చర్చలు సైతం సానుకూలంగా జరిగినట్టు టాక్ నడిచింది. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ పై లేఖాస్త్రం అన్నట్టు తెలుస్తోంది.
ముద్రగడ ప్రేమ కాపుల పైనా, జగన్ పైనా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..