Manipur : కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన అంశాలు కళ్లకు కట్టాయి. మణిపూర్,మయన్మార్ మధ్యనున్న సరిహద్దు సమస్యల తీవ్రతను వివరించారు.
మయన్మార్ లో జరుగుతున్న అంతర్యుద్ధంలో భాగమే ‘కుకీల’ తెగ వివాదం. మిజోరం, మణిపూర్ ను ఆనుకొని ఉన్న మయన్మార్ లోని చిన్ రాష్ట్రంలో కుకీలు ఉన్నారు. ఆ కుకీలు కూడా మయన్మార్ మిలటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
మణిపూర్ లోని సమస్య మతం సమస్య కాదు. తెగల సమస్య, మత్తు మందుల సమస్య. మైతీల్లో ఒక అభద్రత భావం నెలకొంది. కుకీలు అక్రమంగా వలస వచ్చి తమ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని మైతీలు భావిస్తున్నారు. అడవుల్లోకి వచ్చి.. ఇప్పుడు లోయల్లోకి వచ్చారు. మణిపూర్ లో 10 శాతం ఉన్న అడవిలోకి కుకీలు వస్తే మాకు ఉద్యోగ, ఉపాధి దూరమవుతుందని మైతీలు భయపడుతున్నారు.
మయన్మార్ లో యుద్ధం జరుగుతోంది. అక్కడికి కుకీలు వెళ్లలేరు. భారత్ కు వస్తే ఇక్కడ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. కుకీల కోసం గ్రామాన్ని క్రియేట్ చేయడం మైతీల కోపానికి కారణమైంది. ఈ టైంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అదే అసలు వివాదానికి కారణమైంది.
పార్లమెంట్ లో అమిత్ షా చెప్పిన మణిపూర్ సరిహద్దుల్ని గురించి మరింత వివరంగా ‘రామ్’ గారు వివరించారు. దీనిపై స్పెషల్ ఫోకస్..