Hemant Soren : ఈడీ దాడులు, అరెస్టుల్ని జనం ఎలా చూస్తున్నారు?

Hemant Soren: ఈడీ దాడులు, అరెస్టుల్ని జనం ఎలా చూస్తున్నారు?

Written By: NARESH, Updated On : February 1, 2024 4:06 pm

Hemant Soren : ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్.. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా దీనిమీదనే చర్చ. ఈడీ నిన్న ఏకంగా జార్ఖండ్ ముఖ్యమంత్రినే అరెస్ట్ చేసింది. అంటే ఈడీకి ఉన్న పవర్ అలాంటిది. ఈడీ ముఖ్యంగా మనీలాండరింగ్ కు సంబంధించిన చట్టం. కొంతమంది న్యూట్రల్ ఎడిటర్స్ గా ఈడీపై తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

ఈడీపై ప్రధాన మైన ఆరోపణలు చూస్తే.. మోడీ మీద.. నియంత, ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నాడు.. రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. విమర్శకులు చెప్పేదాంట్లో అసలు వాస్తవాలు లేవంటే కరెక్ట్ కాదు. వాస్తవాలున్నాయి. వాస్తవాలు తమకు అనుకూలంగా మార్చుకోవడమే మాకు నచ్చదు. కొన్ని రాష్ట్రాలు చూస్తే.. పశ్చిమ బెంగాల్ లో ఈడీ అరెస్ట్ చేసింది ఎవరంటే పార్థ చటర్జీ.ఈయన ఫియాన్సీ దగ్గర కోట్లు దొరికాయి. అనుబ్రూత మండల్ ఇంకో స్కాండల్ నిందితుడు. చాలా స్కాంలు ఈయన చేశాడు. జ్యోతిప్రియ ఈయన రేషన్ స్కాం చేశాడు.

సరే.. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ మేనర్జీ చేసిన స్కాంలు బయటపడ్డాయి. సామాన్య ప్రజలు వీళ్లు అవినీతి చేశారా? లేదా? వీరిపై దాడి చేశారా? లేదా? అని సర్వే చేస్తే 70 శాతానికి పైగా దాడి చేయాలనే చెబుతారు.

ఈడీ దాడులు, అరెస్టుల్ని జనం ఎలా చూస్తున్నారు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.