https://oktelugu.com/

PM Modi : పార్లమెంట్ సమావేశాల తర్వాత ఎన్నికల శంఖారావం పూరించనున్న మోడీ

ఇంతకుముందు చాలామంది బీజేపీలో మహిళలకు ప్రాధాన్యత లేదని విమర్శలను పార్లమెంట్ లో మోడీ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇక పరివార్ వాదం బీజేపీలో లేదని.. ఒక వ్యక్తి చేతుల్లో ఒక కుటుంబం చేతుల్లో కమలం పార్టీ లేదంటూ ఉదాహరణలతో సహా మోడీ వివరించారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 6, 2024 / 12:01 PM IST
    Follow us on

    PM Modi : లోక్ సభలో ప్రధాని మోడీ గంటా 45 నిమిషాలు ప్రసంగం ఆకట్టుకుంది. కాంగ్రెస్ ను ఉతికి ఆరేశారు. జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఇప్పటి రాహుల్ గాంధీ వరకూ ఉతికి ఆరేశారు. ఎన్నికలకు 10 సంవత్సరాల రిపోర్ట్ కార్డును మోడీ లోక్ సభలో పెట్టారు. మిగతా పార్టీల గురించి ఏమాత్రం విమర్శించలేదు.

    ఇక మోడీ ప్రసంగంలో అత్యంత ఆకట్టుకుంటున్నది ‘మహిళా సాధికారత’నే .. ప్రభుత్వం ఇచ్చిన 4 కోట్ల ఇళ్లకు యజమానులు మహిళలే కావడం ఎంతో గొప్ప గౌరవంగా మోడీ అభివర్ణించారు. ఓనర్ కు మహిళల పేరు పెట్టాం. ఉజ్వల కలెక్షన్లు, తాగునీటి కలెక్షన్లు అన్నింటికి మహిళల మీదే ఇచ్చామని మోడీ చెప్పుకొచ్చారు. మహిళా సాధికారత అనేది చేతల్లో చూపించామని మోడీ ప్రసంగంలో హైలెట్ చేశారు.

    ఇంతకుముందు చాలామంది బీజేపీలో మహిళలకు ప్రాధాన్యత లేదని విమర్శలను పార్లమెంట్ లో మోడీ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇక పరివార్ వాదం బీజేపీలో లేదని.. ఒక వ్యక్తి చేతుల్లో ఒక కుటుంబం చేతుల్లో కమలం పార్టీ లేదంటూ ఉదాహరణలతో సహా మోడీ వివరించారు.

    దీన్ని ఢిల్లీ భారత మండపంలో ఎన్నికల శంఖారావం పూరించనున్న మోడీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.