https://oktelugu.com/

Paytm And Jio : Jio చేతిలోకి Paytm.. అసలు తెరవెనుక ఏం జరిగింది

ఈ మేరకు ముఖేష్ అంబానీకి చెందిన NBFC, HDFC బ్యాంకులను వన్ 97 సంస్థ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 6, 2024 / 11:30 AM IST

    Jio and Paytm

    Follow us on

    Paytm And Jio : పేటీఎంలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఆ యాప్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పేటీఎం మాతృసంస్థ వన్ 97 సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఆ సంస్థ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో ఈ సంస్థను ఇతర కంపెనీకి విక్రయిస్తుందన్న వార్తలు జోరందుకుంటున్నాయి. అయితే వన్ 97 సంస్థను అపర కుభేరుడు ముఖేష్ అంబానీ చేజిక్కుంచుకునే అవకాశం ఉందని జోరుగా వినిపిస్తోంది. ఈ మేరకు ముఖేష్ అంబానీకి చెందిన NBFC, HDFC బ్యాంకులను వన్ 97 సంస్థ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ప్రచారం కావడంతో సోమవారం ముఖేష్ అంబానీకి చెదిన ‘జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 15 శాతం పెరిగాయి.

    Paytm మాతృసంస్థ వన్ 97 తమ వ్యాపారాన్ని విక్రయించడానికి కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ తరుణంలో పేటీఎం పై జియో ఫైనాన్షియల్ పేటీఎంపై ఇంట్రెస్ట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలో సాగుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) జియో ఫైనాన్స్ లిమిటెడ్, జియో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లిమిటెడ్, జియో పేమెంట్ సోల్యూషన్ కు చెందిన ఆర్థిక కార్యకలాపాను నిర్వహిస్తుంటుంది. ఈ కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మేనేజర్ బ్లాక్ రాక్ తో 300 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను పెట్టింది. భారత్ లోని మిలియన్ల మంది ఇందులో ఇన్వెస్ట్ దారులుగా ఉన్నారు.

    2023 డిసెంబర్ వరకు దీని నికర లాభం రూ.293.82 కోట్లు. ఇది రిలయన్స్ నుంచి వేరు బడి అదే సంవత్సరం ఆగస్టు 21న స్టాక్ ఎక్చేంజ్ లోకి ప్రవేశించింది. తాజాగా ఫిబ్రవరి 5 సోమవారం దీని షేర్లు 15 శాతం వరకు పెరిగాయి. దీంతో ప్రస్తుతం జియో ఫైనాన్సియల్ షేర్లు 288.75 గరిష్టానికి చేరుకున్నాయి. అయితే పేటీఎం ను కొనుగోలు చేయడానికి హెచ్ డీఎఫ్ సీ, జియో ఫైనాన్షియల్ లు ముందు ఉన్నాయని పేటీఎం అధినేత విజయ్ వర్మ తెలిపారు. ఇందులో భాగంగా చర్చలు సాగుతున్నట్లు తెలిపారు.