Ram Charan: మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే చాటుకుంటున్నాడు. ఆయన మెగాస్టార్ కొడుకు నుంచి మెగా పవర్ స్టార్ గా ఎదిగిన తీరు వర్ణనాతీతం అనే చెప్పాలి. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన శంకర్ తో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే బుచ్చిబాబు సన డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
ఇక తొందరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ సినిమా స్టోరీ లీక్ అయినట్టు గా వార్తలు వస్తున్నాయి. ఫుట్ బాల్ గేమ్ నేపథ్యంలో ఉండనున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఇందులో రామ్ చరణ్ ఫుట్ బాల్ గేమ్ ఆడటం వల్ల ఒక ఊరిని కాపాడబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ గేమ్ కి, ఆ ఊరికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి.? అనే ఒక కీలకమైన అంశంతో ఈ సినిమా తెరకెక్కబోతునట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాతో మరోసారి భారీ రేంజ్ లో సక్సెస్ కొట్టాలని రామ్ చరణ్ చూస్తున్నాడు. ఇక బుచ్చిబాబు కూడా ఈ సినిమాతో తనని తాను పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని ఉత్సాహపడుతున్నాడు.
కాబట్టి ఎలాగైనా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని ఇద్దరు కోరుకుంటున్నారు. ఇక తొందరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లో భారీ సక్సెస్ ని అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు రాబోయే గేమ్ చేంజర్ సినిమాతో కూడా మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని చూస్తున్నాడు. ఇక శంకర్ డైరెక్షన్ వస్తున్న ఈ సినిమా రావడం లేటైనప్పటికి వచ్చాక మాత్రం భారీ హిట్ కొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది…అయితే ఈ సినిమాలతో వరుసగా సక్సెస్ లు సాధిస్తే ఇక రామ్ చరణ్ కి తిరుగు ఉండదనే చెప్పాలి.