Homeఅంతర్జాతీయంOperation Kaveri : ప్రపంచంలో ఇజ్రాయెల్ తర్వాత అంతటి సాహసం చేసిన ఇండియన్ ఆర్మీ

Operation Kaveri : ప్రపంచంలో ఇజ్రాయెల్ తర్వాత అంతటి సాహసం చేసిన ఇండియన్ ఆర్మీ

Operation Kaveri : అది ఉక్రెయిన్ అయినా.. సుడాన్ అయినా భారతీయులు ఆపదలో ఉన్నారంటే నేనున్నానంటూ ఆపదలో ముందుకు వస్తున్నాడు మన ప్రధాని నరేంద్రమోడీ. భారత వాయుసేనను రంగంలోకి దింపి మరీ సాహసోపేత మిలటరీ ఆపరేషన్ తో భారతీయులను ఇండియాకు తీసుకవస్తున్నారు.

తాజాగా భారత సైన్యం చేపట్టిన సాహసోపేతమైన రెండు రోజుల సూడాన్ ఆపరేషన్‌కు అంతర్జాతీయ ప్రశంసలు పొందింది, ఇది గతంలో ఉగాండాలో ఇజ్రాయెల్ చేసిన గత ఆపరేషన్‌తో దాదాపుగా సరిపోలింది. భారత వైమానిక దళం సాహసోపేత చర్యతో, ప్రపంచం ఆశ్చర్యపోయింది అంతేకాక భారతదేశం యొక్క ఎదుగుదలను ప్రశంసించింది. భారత శకం మొదలైందని మాట్లాడడం మొదలుపెట్టారు.

ఈ సంఘటన చాలామందికి అనూహ్యంగానూ ఆశ్చర్యంగాను ఉంది. గతంలో ఉక్రెయిన్ మరియు కాబూల్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా భారతీయులను రక్షించడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే వారు అన్ని అనుమతులతో పూర్తిస్థాయిలో ఆపరేషనల్‌గా ఉన్న విమానాశ్రయాలలో పగటి వెలుతురులో సురక్షితంగా చేసారు.
సూడాన్‌లో అలా కాదు, సుడాన్ యొక్క గగనతలం మూసివేయబడింది, విమానాలు ఎగరడానికి అనుమతి లేదు, కేవలం అమెరికా మాత్రమే తన రాయబారులను రక్షించడానికి ధైర్యంగా తన హెలికాప్టర్‌లను పంపింది.

అన్ని ఇతర దేశస్తులు అక్కడ ఇరుక్కుపోయారు. విమానాశ్రయం దగ్గరలో యుద్ద పరిస్థితుల వల్ల విమానాల రాకపోకలు అసాధ్యం. అంతేకాక ఇతర మార్గాలు మృగ్యం. ఆ దేశంలో భారతీయులతో సహా అనేక మంది ఇలా చిక్కుకుపోయారు. మొత్తం భారతీయులు 121 మంది ఇలా చిక్కుకుపోయారు. వారిని రక్షించడం భారతదేశానికి పెద్ద సవాలుగా మారింది.

ప్రధాని మోదీ భారత వైమానిక దళానికి పూర్తి అధికారాన్ని ఇవ్వడంతో ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి భారత వైమానిక దళం వీరోచితంగా రంగంలోకి దిగింది. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. విదేశీ విమానాలు సుడాన్‌లో ఎగరలేవు ఎందుకంటే బీకరంగా యుద్దం చేస్తున్న రెండు వర్గాలవారు భయంతో దాడి చేయవచ్చు. ప్రధాన విమానాశ్రయం శిధిలమై ఉంది, ఇటువంటి పరిస్థితుల మధ్య సూడాన్ అనుమతి లేకుండా అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించాలి. భారత ఇంటెలిజెన్స్ సూడాన్‌ను పరిశోధించి రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో మనిషనేవాడు లేని, పాడుబడిన వాడకంలోలేని పాత విమానాశ్రయాన్ని కనుగొంది. అక్కడ విమానాన్ని ల్యాండ్ చేయవచ్చు కానీ అత్యంత ప్రమాదకరం.

సమస్యలు అన్నింటిలో మొదటిది అక్కడ నేలపై ఎవరూ లేరు, కరెంటు లేదు, లైట్లు లేవు, ఎయిర్ ట్రాఫిక్ గైడెన్స్ లేదు, ఇక్కడ విమానం ల్యాండింగ్ లేదా టేకాఫ్‌కు అత్యంత ప్రమాదకరం. ఒకవేళ విమానం అక్కడకు వచ్చినా అది సూడనీస్‌ని ధిక్కరించి రహస్యంగా రావడానికి సుడాన్ అనుమతించదు. భారతీయ విమానాలు సూడనీస్ గగనతలంలో ఎగరడానికి పెట్రోలింగ్ చెయ్యని సురక్షిత ఆకాశ మార్గం మరొకటి లేదు.

చుట్టూరా అన్నీ సమస్యలే. ఇన్ని ప్రమాదాల మధ్య మొదటగా భారత వైమానిక దళం తన కమాండోలతో కూడిన ఒక పెద్ద విమానాన్ని సౌదీ జెడ్డాకు పంపింది. అది సూడాన్ వైపు దగ్గరగా ఉన్న ప్రాంతం. తద్వారా ఒక్కసారి ఇంధనం నింపుకుంటే సూడాన్‌కు వెళ్ళి మరలా తిరిగి రావడానికి సరిపోతుంది. సూడాన్‌లో అదే రోజు సాయంత్రానికి చిక్కుకుపోయిన 121 భారతీయులను అక్కడకు చేర్చారు. విమానం అక్కడ దిగీ దిగగానే అందరినీ నిశ్శబ్దంగా విమానం ఎక్కించాలి. సూడనీస్ పాడుబడ్డ విమానాశ్రయం నుండీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అత్యంత రహస్యంగా ప్రమాదకరమైన సంచలన ఆపరేషన్‌ను సాహసోపేతంగా నిర్వహిస్తున్నది.

ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ సాహస చర్య మొదలైంది. లైట్లు లేకుండా చీకటిలో విమానం ఎగిరింది, లైట్లు లేకుండా ఎగరడంతో సూడాన్ దళాలు దానిని చూడలేకపోయారు. భారతదేశానికి ఇప్పుడు నైట్ విజన్ అటాక్ పరికరాలు ఉన్నాయి కాబట్టి పైలట్లు విమానాన్ని లైట్లు లేకుండా నడప గలిగారు. ఉపగ్రహ సహాయంతో భారత విమానం చీకటిలో అక్కడ వరకు ప్రయాణించ గలిగింది. పైలట్లు రాత్రి చీకటిలోనే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇంజన్ షట్ డౌన్ చెయ్య లేదు. అలానే విమానం డోర్ తెరవడంతోనే భారత కమాండోలు ఒక్క ఉదుటున మొత్తం 121 మందిని మెరుపు వేగంతో విమానంలోనికి చేర్చారు. అంతా కలిపి మొత్తం మీద కేవలం 7 నిమిషాల పాటు మాత్రమే విమానం అక్కడి నేలపై నిలచి ఉంది. ఆ వెంటనే సౌదీ అరేబియాలోని జెడ్డా దిశగా క్షణం ఆలస్యం లేకుండా విమానం టెకాఫ్ తీసుకుని వెళ్ళిపోయింది. సౌదీ జెడ్డాలో దిగి ఆ తర్వాత అక్కడ నుండీ భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు.

ఈ సంఘటనతో ప్రపంచ వేదికపై ఎంతో మందికి దిమ్మ తిరిగినట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ తప్ప ఇప్పటి వరకూ మరే దేశం ఇలాంటి సాహసం చెయ్యలేదు. ఇంత కాలం తరువాత ఇప్పుడు భారతదేశం చేసింది.భారత సైన్యం మిలటరీ ఎయిర్‌ ఆపరేషన్స్ విషయంలో ఏ స్థాయిలో మెరుగుపడిందో తెలిసి పాకిస్థాన్‌కు వణుకు పుడుతోంది, చైనా ఈ విషయమై నోరు మెదపడం లేదు. ఈ ఆపరేషన్ యావత్తూ ఎన్నో సవాళ్ళతో కూడుకున్నది. విమానం ఏ సమస్యతోనైనా ఇరుక్కుపోయినా లేదా ఇరు పక్షాల సైనికులు ఎవ్వరు చుట్టుముట్టినా అతి పెద్ద ప్రమాదం. సవాలక్ష సమస్యలు ప్రమాదాలు ఉన్నప్పటికీ ఎంతో సాహసంతో ఈ ఆపరేషన్ రూపొందించి అమలు చేశారు.

మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప సాహసం చేసింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్న ఈ ఆపరేషన్ ఏప్రిల్ 29,2023 శనివారం నాడు జరిగింది. మోదీజితో సహా యావత్ భారత మీడియా కూడా ఊపిరి పీల్చుకోలేదు. అయినా ఎవ్వరీ దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అది దౌత్యం. ప్రపంచం ఏమి మాట్లాడబోతోందో మనం మొదట ఎందుకు చెప్పాలి? భారత సైన్యంపై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రుల మాదిరిగా మోదీ చరిత్రలో నిలిచిపోయారు. తమ ప్రజలను కాపాడుకునేందుకు మోదీ నేతృత్వంలోని భారత్ ఎంతకైనా తెగిస్తుందని నేటి ఈ బీజేపీ ప్రభుత్వం నిరూపించింది.

ఈ ఘనత సాధించిన పైలట్‌, ఇతర సిబ్బంది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వీరి పేర్లను అవార్డులకు ఎప్పుడు ప్రకటిస్తారో అప్పుడు కచ్చితంగా తెలిసిపోతుంది. భారత వైమానిక దళం ఒక గొప్ప విజయాన్ని సాధించింది. ప్రతి భారతీయుడు తమ ఛాతీని పైకెత్తి గర్వంగా వారికి సెల్యూట్ చేయాల్సిన సమయం ఇది.భయం లేదు, భీతి లేదు, వెనుకడుగు లేదు. ఎన్ని ప్రమాదాలను శంకించినా, ఎన్ని అడ్డంకులు ఉన్నా, ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్బయంగా, సాహసోపేతంగా, మోదీ ప్రభుత్వం అండతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ఈ చర్యతో భారత్ ప్రపంచంలో ఒక అజేయ శక్తిగా కనపడుతున్నది.

బెంగళూరు సమీపంలో రాజీవ్ హంతకులు మెరుపుదాడి చేసినప్పుడు ఢిల్లీ నుంచి కమాండోలకు అనుమతి రావడానికి రెండు రోజులు పట్టింది. ముంబై దాడి సమయంలో ఢిల్లీ నుంచి కమాండోలకు అనుమతి రావడానికి ఒక రోజు పట్టింది మోడీ హయాంలో కేవలం 7 నిమిషాల్లో సూడాన్ నుండి భారతీయులను రక్షించడం చూస్తుంటే గతానికి భిన్నంగా మోదీ తన సుపరిపాలనతో ఆయన పాలనలో మరోసారి దేశాన్ని ఘనమైన స్థానంలో నిలుపుతున్న ఈ ఉదంతం ఒక చారిత్రక విజయ వీచిక. భారత ప్రభుత్వం రక్షణ దళాలకు ఇచ్చిన స్వేచ్ఛతో భారత వాయుసేన సాధించిన గొప్ప కార్యమిది.నేడు ప్రపంచ వేదికపై భారతదేశం ప్రభ ప్రకాశిస్తున్నది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular