
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 – 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను నేడు లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విపక్షాలు నిరసనకు దిగగా నిరసనల మధ్యలోనే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం గమనార్హం. నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టారు. ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు కోసం ఏకంగా 64,180 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రాబోయే ఆరు సంవత్సరాల్లో ఈ నగదును ఖర్చు చేయనుంది. 15 అత్యవసర కేంద్రాలను, 9 బీ.ఎస్.ఎల్ 3 ప్రయోగశాలలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. మేడిన్ ఇండియా ట్యాబ్ ద్వారా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం గమనార్హం. కేంద్రం బడ్జెట్ లో 35 వేల కోట్ల రూపాయలు కరోనా వ్యాక్సిన్ కోసం ఖర్చు చేయనుంది.
నేషనల్ ఫస్ట్ లో భాగంగా రైతుల ఆదాయాన్ని కేంద్రం రెట్టింపు చేయడంతో పాటు యువత ఉపాధి, మహిళా సాధికారతకు కేంద్రం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఆత్మ నిర్భర్ ఆరోగ్య పథకానికి కేంద్రం 2,23,846 కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు అన్ని జిల్లాలలో సమీకృత వ్యాధి నిర్ధారణ కేంద్రాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. 15 సంవత్సరాల పై బడిన వాహనాలను తుక్కు కింద మార్చే పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
కేంద్రం వాహనాల ఫిట్ నెస్ పరీక్షకు ప్రత్యేక విధానం అమలులోకి తీసుకురానుంది. కేంద్రం విద్యుత్ రంగంలో సంస్కరణలు చేయనున్నట్టు తెలిపింది. చెన్నై మెట్రో కొరకు 63 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. మరో కోటి మందికి ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సరఫరా చేయనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.