https://oktelugu.com/

ఆ ఆరు స్తంభాల బేస్‌లోనే బడ్జెట్‌ రూపకల్పన

కేంద్ర బడ్జెట్‌ను నేడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. కరోనా దృష్ట్యా ఇప్పుడు అందరి దృష్టి ఈ బడ్జెట్‌పైనే ఉంది. బడ్జెట్‌లో ఏయే రంగాలకు బూస్టింగ్‌ ఇవ్వబోతున్నారు.. సామాన్యులకు ఎలాంటి ఫలాలు అందబోతున్నాయో ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. దేశంలో నెలకొన్న అత్యంత కఠిన పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రతిపాదనలకు రూపకల్పన చేశామని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందెప్పుడూ లేవని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2021 5:43 pm
    Follow us on

    Finance Minister
    కేంద్ర బడ్జెట్‌ను నేడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. కరోనా దృష్ట్యా ఇప్పుడు అందరి దృష్టి ఈ బడ్జెట్‌పైనే ఉంది. బడ్జెట్‌లో ఏయే రంగాలకు బూస్టింగ్‌ ఇవ్వబోతున్నారు.. సామాన్యులకు ఎలాంటి ఫలాలు అందబోతున్నాయో ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. దేశంలో నెలకొన్న అత్యంత కఠిన పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రతిపాదనలకు రూపకల్పన చేశామని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందెప్పుడూ లేవని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లను నమోదు చేశామని పేర్కొన్నారు.

    Also Read: చరిత్రలో తొలిసారి.. నిర్మల పేపర్ లెస్ ‘స్మార్ట్’ బడ్జెట్

    ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను చూస్తుంటే.. జనంపై మోత బరువు తప్పదనే సంకేతాలను ఇచ్చినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2021 కొత్త దశాబ్దంలో తొలిసారిగా బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశపెట్టే సువర్ణావకాశం తనకు దక్కిందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దేశ ప్రజల అకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా బడ్జెట్ ఉండబోతోందని ఊరించారు. ఈ సారి డిజిటల్ రూపంలో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించామని, మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశామని అన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తులను ప్రస్తావించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి సుదీర్ఘకాలంపాటు అమలు చేసిన లాక్‌డౌన్ పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించామని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. 27.1 లక్షల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజీని అమలు చేశామని గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా సిలిండర్లను పంపిణీ చేశామని చెప్పారు.

    Also Read: టీఆర్ఎస్ ప్రశ్న: బీజేపీ అయోధ్య వసూళ్ల లెక్కలేవి?

    గరీబ్ కల్యాణ్ యోజన, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీల కింద అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను అందజేశామని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కింద దేశం సొంతంగా రెండు కరోనా వ్యాక్సిన్లను రూపొందించిందని, వందకు పైగా విదేశాలకు సైతం వాటిని సరఫరా చేసే స్థాయికి ఎదిగామని అన్నారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న మరో రెండు కరోనా వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఫలితంగా అత్యంత తక్కువ శాతం మరణాలను నమోదు చేసిన దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ పరిస్థితులను అవకాశంగా మార్చుకోవడంలో విజయం సాధించామని అన్నారు. 2021–22 బడ్జెట్ ప్రతిపాదనలకు ఆరు కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నామని అన్నారు. ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, సమీకృత అభివృద్ధి, ఇన్నోవేషన్, పరిశోధనలు, మినిమమ్ గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అంశాల ఆధారంగా ఆర్థిక పురోగమనాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు.