https://oktelugu.com/

బాలకృష్ణ, రవితేజల మధ్య మళ్ళీ పోటీ !

బాలకృష్ణ, రవితేజ సినిమాల మధ్య పోటీ ఇప్పటిది కాదు, గతంలోనూ అనేకసార్లు వీరిద్దరి సినిమాలు పోటీ పడ్డాయి. బాలయ్య రేంజ్ హీరో కాకపోయినా రవితేజ ఎక్కడా వెనక్కి తగ్గకుండా మొత్తానికి పోటీలో నిలుస్తున్నాడు. కాగా తాజాగా పోటీ మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను మే 28న రిలీజ్ చేయబోతున్నట్టు కొన్ని రోజుల కిందట ప్రకటించాడు. ఇప్పుడు అదే తేదీని తాపీగా బాలకృష్ణ కూడా ప్రకటించాడు. నట సింహం బాలయ్య బాబు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 1, 2021 / 11:53 AM IST
    Follow us on


    బాలకృష్ణ, రవితేజ సినిమాల మధ్య పోటీ ఇప్పటిది కాదు, గతంలోనూ అనేకసార్లు వీరిద్దరి సినిమాలు పోటీ పడ్డాయి. బాలయ్య రేంజ్ హీరో కాకపోయినా రవితేజ ఎక్కడా వెనక్కి తగ్గకుండా మొత్తానికి పోటీలో నిలుస్తున్నాడు. కాగా తాజాగా పోటీ మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను మే 28న రిలీజ్ చేయబోతున్నట్టు కొన్ని రోజుల కిందట ప్రకటించాడు. ఇప్పుడు అదే తేదీని తాపీగా బాలకృష్ణ కూడా ప్రకటించాడు. నట సింహం బాలయ్య బాబు బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ను నిన్న అధికారికంగా మే 28 అని అనౌన్స్ చేసారు.

    Also Read: వేసవిలోనే “చావు కబురు చల్లగా”

    మరి రవితేజ సినిమా పై పోటీకి వస్తోన్న బాలయ్య సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో ఓ యంగ్ హీరో పాత్ర ఉందని, ఆ పాత్రలో నాగశౌర్య నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది బాలయ్య అసిస్టెంట్ పాత్ర. కాగా ఈ పాత్రకి.. ముందుగా నవీన్ పొలిశెట్టిని తీసుకుందామనుకున్నా.. ఇంకా బెటర్ అప్షన్ అయితే బాగుంటుందని, నాగశౌర్యకి వెళ్లారు. నాగశౌర్యది జస్ట్ గెస్ట్ రోల్ లాగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ అసిస్టెంట్ రోల్ చాల కీలకమైనదట. చాల ఎమోషనల్ గా ఉంటుందని.. మొత్తం కథకు కీలక పాత్ర అని.. అందుకే ఆ పాత్ర కోసం ఓ దశలో నానిని కూడా అనుకున్నారు.

    Also Read: బాలయ్య సినిమాకి తేదీ ఖరారు !

    ఇక ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదట కొత్త హీరోయిన్ అనుకున్నా.. ప్రగ్య వైపే మొగ్గు చూపారు. అలాగే మరో భామగా పూర్ణ నటిస్తోంది. బోయపాటి, ఈ సినిమాలో ప్రగ్యని కలెక్టర్ గా చూపించబోతున్నాడు. ఎక్కువుగా గ్లామర్ రోల్స్ లో అలరించే ప్రగ్య ఈ సినిమాలో కలెక్టర్ పాత్రలో ఎలా ఉంటుందో చూడాలి. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించి, బాలయ్య ఫ్యాన్స్ కు ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి, మరి ఆ అంచనాల దెబ్బకు రవితేజ సినిమా నిలబడుతుందా అనేదే ప్రశ్న.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్