
Meter Movie Review: నటీనటులు:కిరణ్ అబ్బవరం , అతుల్య రవి, పోసాని కృష్ణ మురళి , సప్తగిరి, ధనుష్ పవన్
డైరెక్టర్ : రమేష్ కడూరి
సంగీతం : సాయి కార్తీక్
బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్
రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన యువ హీరోలలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే కిరణ్ అబ్బవరం అని కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు.మొదటి సినిమా నుండే ఈయన ప్రేక్షకుల్లో తనదైన మార్కుని వేసుకున్నాడు.ఇక SR కల్యాణ మండపం సినిమా తో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న కిరణ్ అబ్బవరం, ఈ ఏడాది లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతోనే మరో కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు.అయితే మనోడి కెరీర్ ఒక హిట్టు ఒక ఫ్లాప్ అన్నట్టుగా ముందుకు సాగిపోతుంది.ఇక ఈరోజు విడుదలైన ‘మీటర్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధించింది.మాస్ ఇమేజి కోసం కిరణ్ అబ్బవరం చేసిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని ఆకట్టుకుండా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.
కథ :
అర్జున్ కళ్యాణ్( కిరణ్ అబ్బవరం) కి తన తండ్రి అంటే చిన్నప్పటి నుండి పడదు.ముఖ్యంగా ఆయన పనిచేసే పోలీస్ ఉద్యోగం అంటే అసలు ఇష్టం లేదు.జీవితంలో పోలీస్ ఆఫీసర్ అవ్వకూడదని అనుకుంటాడు.కానీ ఆయన తలరాత ప్రకారం సబ్ ఇన్స్పెక్టర్ గా చేరాల్సి వస్తుంది.ఎలా అయినా సస్పెండ్ అయ్యి ఈ పోలీస్ ఉద్యోగం ని వదిలించుకోవాలనే ఉద్దేశ్యం తో ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు,కానీ ఆ ప్రయత్నాలన్నీ అతనికి మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చిపెడుతుంది.ఈ జాబ్ ని ఎలా వదిలించుకోవాలి రా బాబు అని ఆయన అనుకుంటున్నా సమయం లో హోమ్ మినిస్టర్ కంఠం బైరెడ్డి గురించి ఒక సంచలన నిజం బయటపడుతుంది.ఆ నిజాన్ని తెలుసుకున్న అర్జున్ కళ్యాణ్ ఏమి చేసాడు..? అనేదే మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
కమర్షియల్ సినిమాలన్నీ ఇలాగే రొటీన్ ఫార్మటు లో ఉండడం సర్వసాధారణం, కానీ ట్రీట్మెంట్ లో కొత్తదనం కనిపించాలి, అప్పుడే సక్సెస్ అవుతాయి, కమర్షియల్ సినిమాలను తియ్యడం అనేది ఒక ఆర్ట్ అని సినీ పెద్దలు ఊరికే అనరు.రీసెంట్ గా కమర్షియల్ సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ అందరూ స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ విషయం లో కొత్తదనం చూపించారు, కానీ ఈ చిత్ర డైరెక్టర్ రమేష్ కడూరి మాత్రం అందులో విఫలం అయ్యాడు.హీరో కిరణ్ అబ్బవరం మాత్రం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు,కమర్షియల్ మాస్ ఇమేజి కోసం ఆయన ఫైట్స్ చేసాడు, డ్యాన్స్ కూడా బాగానే చేసాడు, కానీ డైరెక్టర్ టేకింగ్ సరిగా లేకపోవడం వల్ల చూసే ఆడియన్స్ కి బాగా బోర్ కొడుతాది.స్టోరీ లైన్ బాగానే ఉంది, కానీ టేకింగ్ విషయం లో కాస్త శ్రద్ద తీసుకొని ఉంది ఉంటే, కిరణ్ అబ్బవరం కి ఈ చిత్రం 20 కోట్ల రూపాయిల షేర్ సినిమా గా నిలిచేది.

కిరణ్ అబ్బవరం సినిమాలలో మనం ముఖ్యంగా మెచ్చుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంటుంది.అదేమిటంటే ఈయన తన మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన సినిమా వరకు, ప్రతీ చిత్రం లో హీరోయిన్ కి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది.కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆతుల్య రవి కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది.ఇక ఒక సినిమాని కాపాడేది సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.కానీ ఈ సినిమాకి అదే మైనస్ అయ్యింది.ఒక కమర్షియల్ సినిమాకి ఆయువు పట్టులాగా నిలిచేది పాటలే, కేవలం పాటల కారణం గా సూపర్ హిట్ గా నిల్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.ఈ చిత్రం లో పాటలు బాగా ఉండిఉంటే కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా అయినా నిలిచేది.కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది.
చివరి మాట:
కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే పరమ చెత్త సినిమా అని చెప్పొచ్చు,కనీసం టైంపాస్ చేసే విధంగా కూడా ఈ సినిమా లేదు.
రేటింగ్ : 2 /5