మనలో చాలామంది చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు మరిచిపోతూ ఉంటాం. ముఖ్యంగా పాస్ వర్డ్ లను మరిచిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంగా పాస్ వర్డ్ ను మరిచిపోవడం వల్ల ఇబ్బంది పడే ఉంటారు. అయితే పాస్ వర్డ్ ను మరిచిపోయినా కొన్ని ఆప్షన్స్ ద్వారా కొత్త పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకుని చాలామంది ఈ సమస్యను సులభంగా అధిగమిస్తారు.
Also Read: నెలకు రూ.3,555 చెల్లిస్తే కొత్త కారు.. ఎలా అంటే..?
అయితే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి మతిమరపు మాత్రం అతనికి ఏకంగా 1,753 కోట్ల రూపాయలు నష్టం తెచ్చిపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికాలోని వాషింగ్టన్ లో స్టీఫెన్ థామస్ అనే వ్యక్తి నివశిస్తూ ఉండేవాడు. వృత్తిరిత్యా ప్రోగ్రామర్ అయిన స్టీఫెన్ బిట్ కాయిన్ ధర తక్కువగా ఉన్న సమయంలో ఏకంగా 7,000 బిట్ కాయిన్లను కొనుగోలు చేశాడు. స్టీఫెన్ బిట్ కాయిన్లను కొనుగోలు చేసిన కొన్ని నెలల తరువాత వాటి ధర అమాంతం పెరిగింది.
Also Read: రూ.877కే విమాన ప్రయాణం చేసే అవకాశం… కానీ..?
స్ట్రాంగ్ పాస్‌వర్డ్ సహాయంతో బిట్ కాయిన్స్ ను కొనుగోలు చేసిన స్టీఫెన్ కు ఒక బిట్ కాయిన్ ధర ఏకంగా 25 లక్షల రూపాయలకు పైగా పలకడంతో 1753 కోట్ల రూపాయలు అతని సొంతమయ్యే అవకాశం దక్కింది. అయితే తన ఖాతాకు పెట్టిన పాస్ వర్డ్ ను స్టీఫెన్ మరిచిపోయాడు. స్టీఫెన్ ఎంత ప్రయత్నించినా ఆ పాస్ వర్డ్ అతనికి గుర్తుకు రావడం లేదు. బిట్ కాయిన్స్ పాస్ వర్డ్ ను రీసెట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
స్టీఫెన్ కు సరైన పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడానికి పది ఛాన్సులు ఉండగా ఇప్పటికే ఎనిమిది సార్లు స్టీఫెన్ తప్పు పాస్ వర్డ్ ను ఎంటర్ చేశారు. స్టీఫెన్ రెండుసార్లు తప్పు పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రం అతను 1753 కోట్ల రూపాయలు పొందే అవకాశం ఉండదు. స్టీఫెన్ మిగిలిన రెండు అవకాశాల్లో సరైన పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి డబ్బులను తిరిగి పొందుతాడో లేదో చూడాల్సి ఉంది.