భవిష్యత్తులో కరోనా వైరస్ సాధారణ జలుబులా మారిపోతుందా..?

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య తగ్గినా వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. మరోవైపు 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఇప్పటికే దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన నగరాలకు చేరాయి. కరోనా ఉధృతి అదుపులోకి వస్తుంటే కొత్తరకం కరోనా స్ట్రెయిన్ లు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. Also Read: కరోనా వ్యాక్సిన్ […]

Written By: Kusuma Aggunna, Updated On : January 15, 2021 11:52 am
Follow us on


భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య తగ్గినా వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. మరోవైపు 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఇప్పటికే దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన నగరాలకు చేరాయి. కరోనా ఉధృతి అదుపులోకి వస్తుంటే కొత్తరకం కరోనా స్ట్రెయిన్ లు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి.

Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకునే వారికి అలర్ట్.. ఆప్షన్ లేదట..?

అయితే శాస్త్రవేత్తలు మాత్రం కరోనా వైరస్ విషయంలో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో ఈ వైరస్ సాధారణ జలుబులా మారిపోతుందని చెబుతున్నారు. భవిష్యత్తులో కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. నాలుగు కరోనా వైరస్ రకాలపై పరిశోధనలు జరిపి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

Also Read: మీలో ఈ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా.. ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్టే..?

శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు సంబంధించిన పూర్తి వివరాలు జర్నల్ సైన్స్ లో ప్రచురితమయ్యాయి. అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ సైంటిస్ట్ జెన్నీ లావైన్ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజల్లో కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వైరస్ ఉధృతి తగ్గినా వృద్ధుల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందని వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

భవిష్యత్తులో కరోనా వైరస్ ను సాధారణ జలుబు స్థాయికి తగ్గించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా సులభంగా కాపాడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యాక్సిన్లు వైరస్ బారిన పడకుండా కొంతకాలం పాటు రక్షణ పొందడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.