ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11వ తేదీన ఏపీలో అర్హులైన విద్యార్థుల తల్లి ఖాతాల్లో అమ్మఒడి నగదును జమ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అర్హులైన వారందరి ఖాతాల్లో నగదు జమ కాగా ఇప్పటికే కొంతమంది డబ్బును బ్యాంక్ అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకున్నారు. మరి కొందరు సంక్రాంతి పండుగ వల్ల బ్యాంకులు బంద్ కావడంతో తరువాత బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలని అనుకుంటున్నారు.
Also Read: జగన్ తో ఫైట్ ను వదలని నిమ్మగడ్డ.. మరో దుందుడుకు చర్య
అయితే సైబర్ మోసగాళ్లు అమ్మఒడి స్కీమ్ కు అర్హులై బ్యాంక్ అకౌంట్లలో నగదు జమైన వారిని టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీకి చెందిన మహిళలకు అమరావతి నుండి అధికారులం మాట్లాడుతున్నామని చెబుతూ కొందరు మోసగాళ్లు ఫోన్ చేశారు. ఫోన్ కాల్ లో అమ్మ ఒడి పథకం డబ్బులు ఖాతాలో జమయ్యాయా…? వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది..? అనే వివరాలు చెప్పాలని అడుగుతున్నారు.
Also Read: నిమ్మగడ్డకు హైకోర్టులో హనీమూన్ ముగిసినట్టేనా?
ఎవరైనా మోసగాళ్ల మాటలు నిజమేనని నమ్మితే వారికి మొబైల్ ఫోన్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుందని చెబుతూ ఓటీపీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా కొంతమంది బాధితులు డబ్బులు పోగొట్టుకున్నారని తెలుస్తోంది. అందువల్ల అమ్మఒడి స్కీమ్ కు అర్హులైన మహిళలు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఓటీపీ వివరాలు చెబితే క్షణాల్లో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అమ్మఒడి స్కీమ్ నగదు జమైన వారు అధికారుల పేరు చెప్పి వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించి సైబర్ మోసగాళ్లు ఫోన్ చేస్తున్న ఫోన్ నంబర్ల వివరాలను తెలియజేయడం ద్వారా ఇలాంటి మోసాలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.