https://oktelugu.com/

శివరాత్రి పూజ చేస్తున్నారా.. పూజించే సమయంలో పాటించాల్సిన నియమాలివే..?

హిందువుల ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటనే సంగతి తెలిసిందే. శివ పార్వతి వివాహం జరిగిన రోజును శివరాత్రి పండుగగా హిందువులు జరుపుకుంటారు. అభిషేక ప్రియుడు అయిన శివుడికి మహాశివరాత్రి ఎంతో ఇష్టమైన రోజు. మహాశివరాత్రి పండుగ రోజున ఎవరైతే శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు జీవితంలో ఎటువంటి సమస్యలు రావని చాలామంది నమ్ముతారు. శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేయాలనే సంగతి మనందరికీ తెలిసిందే. శివరాత్రి రోజున పరమశివునికి ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతాలు, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 9, 2021 / 06:44 PM IST
    Follow us on

    హిందువుల ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటనే సంగతి తెలిసిందే. శివ పార్వతి వివాహం జరిగిన రోజును శివరాత్రి పండుగగా హిందువులు జరుపుకుంటారు. అభిషేక ప్రియుడు అయిన శివుడికి మహాశివరాత్రి ఎంతో ఇష్టమైన రోజు. మహాశివరాత్రి పండుగ రోజున ఎవరైతే శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు జీవితంలో ఎటువంటి సమస్యలు రావని చాలామంది నమ్ముతారు.

    శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేయాలనే సంగతి మనందరికీ తెలిసిందే. శివరాత్రి రోజున పరమశివునికి ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతాలు, ఆవు పేడతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని తప్పనిసరిగా ఉచ్చరించాలి. చందన లేపనంతో పూజను ప్రారంభించి అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేసి పూర్ణాహుతి నిర్వహించాలి.

    శివకథలు వింటూ జాగరణ చేయడంతో పాటు రథరాత్రి మూడు, నాలుగో జాములో ఆహుతులను మరోసారి సమర్పించాలి. శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. ఇంటిదగ్గర శివుడిని పూజించే వాళ్లు పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో శివునికి అభిషేకం చేయాలి. శివాలయాన్ని కచ్చితంగా దర్శించుకుని రోజంతా ఉపవాస, జాగరణ శివస్మరణలతో ఉండాలి.

    శివరాత్రికి మరుసటి రోజున ఉత్తమ విప్రులు, శివ భక్తులకు అన్నదానం చేయాలి. ఎవరైతే సూర్యోదయం వరకు మౌనోవ్రతం చేయాలని అనుకుంటారో వాళ్లు మనస్సులో ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి.