https://oktelugu.com/

‘జానపదాని’కి పవన్ కళ్యాణ్ సన్మానం

జానపదం.. మన ప్రాణపదం.. గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో ఒకప్పుడు ఈ జానపదమే ప్రజల పదంగా సాగి అందరి నోళ్లలో నానిన ప్రాచీన పాటల పూదోటలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి. సినిమాలు, సంగీత దర్శకుల హోరులో కనుమరుగైపోతున్నాయి. కానీ కొందరు సంగీత దర్వకులు, దర్శకులు ఇంకా అలాంటి వాటిని బయటకు తీసి కాపాడుతున్నారు. ఆ కళాకారులను పైకి లేపుతున్నారు. రాయలసీమ జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్ ను దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ తన సినిమా ‘అరవింద సమేత’లో వాడుకొని […]

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2021 / 06:28 PM IST
    Follow us on

    జానపదం.. మన ప్రాణపదం.. గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో ఒకప్పుడు ఈ జానపదమే ప్రజల పదంగా సాగి అందరి నోళ్లలో నానిన ప్రాచీన పాటల పూదోటలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి. సినిమాలు, సంగీత దర్శకుల హోరులో కనుమరుగైపోతున్నాయి.

    కానీ కొందరు సంగీత దర్వకులు, దర్శకులు ఇంకా అలాంటి వాటిని బయటకు తీసి కాపాడుతున్నారు. ఆ కళాకారులను పైకి లేపుతున్నారు.

    రాయలసీమ జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్ ను దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ తన సినిమా ‘అరవింద సమేత’లో వాడుకొని పాట కూడా పాడించాడు.

    తాజాగా ఈ కళాకారుడిని పవన్ కళ్యాణ్ తో కలిసి త్రివిక్రమ్ సన్మానించాడు. సీమ మండలికాన్ని నేటి తరానికి అందించేందుకు పెంచల్ దాస్ చేస్తున్న కృషి అభినందనీయమని పవన్ అన్నారు.

    ఈ సందర్భంగా సీమ మాండలికం, పలు ఆసక్తికర అంశాలను జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా పెంచల్ దాస్ తో చర్చించారు.