‘పవనాలు’ అస్త్ర సన్యాసం చేశారు. ఏపీ ప్రజల తరుఫున నిలబడి కొట్లాడిల్సిన పెద్దమనిషి కేంద్రంలోని బీజేపీకి సపోర్టు చేశారు. కేంద్రం విశాఖస్టీల్ ప్లాంట్ సహా దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడం కరెక్టే అని కుండబద్దలు కొట్టారు. కేంద్రానికి సపోర్టు చేస్తూ ఏపీ ఉద్యమకారుల నోట్లో మట్టికొట్టినట్టు మాట్లాడారు.
ప్రజలు పోరాడుతున్నా.. ఆందోళన చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ కరగడం లేదు. విశాఖస్టీల్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గడం లేదు. ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తోపాటు ఆఖరు ఏపీ బీజేపీ నేతలు కూడా విశాఖస్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ తప్పు అని అంటున్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం కేంద్రాన్ని వెనకేసుకు రావడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్రంలోని బీజేపీ తీసుకున్న నిర్ణయమని.. నష్టాల్లో ఉన్న కంపెనీలను వదిలేస్తుందని.. వ్యాపారం చేయడం ప్రభుత్వం విధి కాదని కేంద్రం నిర్ణయాలకు మద్దతుగా పవన్ మాట్లాడారు. ప్రభుత్వం వ్యాపారాలు చేయదని.. పెట్టుబడులు పెట్టదని వారు తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుందని సమర్థించారు. కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను’ సమర్థించడం సంచలనమైంది. ఈ విషయంలో కేంద్రాన్ని పవన్ వెనకేసుకురావడం విశేషం. ఈ ఒక్క విశాఖ ప్లాంట్ మాత్రమే కాదని.. దేశవ్యాప్తంగా ఈ ప్రైవేటీకరణ జరుగుతోందని’’ పవన్ స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతాడని.. కేంద్రానికి సపోర్టు చేసి విశాఖ ఉక్కు ఉద్యమకారులను అవమానిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇంత దారుణంగా ఏపీ ప్రజల తరుఫున నిలబడకుండా కేంద్రానికి జనసేనాని సపోర్టు చేసిన వైనం ఏపీ రాజకీయవర్గాలను, ప్రజలను షాక్ కు గురిచేస్తోంది. ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ తరుఫున పవన్ నిలబడడం ఆయనకు రాజకీయంగా నష్టం చేకూరుస్తుందని.. జనసేనకు ఇది పెద్ద దెబ్బ అని కూడా అంటున్నారు.