ప్రేమ ఎక్కువై కొడుకును చంపిన తండ్రి.. ఎందుకంటే..?

చాలామంది తల్లిదండ్రులకు పిల్లలపై ఎంతో ఇష్టం, ప్రేమ ఉంటాయి. అయితే ఆ ప్రేమ ఎక్కువైనా కష్టమే. తాజాగా ఒక ఘటనలో తండ్రి ప్రేమ ఎక్కువై కొడుకును దారుణంగా చంపేశాడు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొడుకు భవిష్యత్తుపై బెంగతో తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొడుకును చంపిన తరువాత తండ్రి రాత్రంతా కొడుకు శవంతో నిద్రపోయాడు. Also Read: ఆధార్, పాన్, రేషన్ కార్డ్ […]

Written By: Kusuma Aggunna, Updated On : November 30, 2020 11:35 am
Follow us on


చాలామంది తల్లిదండ్రులకు పిల్లలపై ఎంతో ఇష్టం, ప్రేమ ఉంటాయి. అయితే ఆ ప్రేమ ఎక్కువైనా కష్టమే. తాజాగా ఒక ఘటనలో తండ్రి ప్రేమ ఎక్కువై కొడుకును దారుణంగా చంపేశాడు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొడుకు భవిష్యత్తుపై బెంగతో తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొడుకును చంపిన తరువాత తండ్రి రాత్రంతా కొడుకు శవంతో నిద్రపోయాడు.

Also Read: ఆధార్, పాన్, రేషన్ కార్డ్ పోగొట్టుకున్నారా.. కొత్తది ఎలా పొందాలంటే..?

పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని సీసమౌ ఏరియాలో అలంకార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. అతనికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. పిల్లలను బాగా చదివించి ఉన్నతమైన భవిష్యత్తు కల్పించాలని తండ్రి భావించాడు. అయితే లాక్ డౌన్ వల్ల శ్రీవాస్తవ ఉద్యోగం కోల్పోయాడు. ఉద్యోగం కోల్పోవడంతో అతను తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.

Also Read: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. తెలియకుండా స్టేటస్ చూసే ఛాన్స్..?

పడుకున్న కొడుకు రుశాంక్‌ ను తండ్రి దారుణంగా చంపేశాడు. ఆ తరువాత శవం పక్కనే పడుకున్నాడు. ఉదయం భార్యను నిద్ర లేపి కొడుకును చంపేసిన విషయం భార్యకు చెప్పాడు. ఆ మాటలు విన్న తల్లి షాక్ కు గురైంది. బాలుడు విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరైంది. ఆ తరువాత ఈ విషయం బంధువులకు చెప్పింది. విషయం తెలిసిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మరిన్ని వార్తలు కోసం: జనరల్

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి శ్రీవాస్తవను అదుపులోకి తీసుకున్నారు. కన్న కొడుకును అతిప్రేమతో చంపేసిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇలాంటి తండ్రులు కూడా సమాజంలో ఉంటారా..? అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో కొడుకుకు మంచి భవిష్యత్తు ఇవ్వలేనని భావించి తండ్రి కొడుకును చంపేశాడని.. ఉద్యోగం పోవడం వల్ల శ్రీ వాస్తవ మానసిక పరిస్థితి బాలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.