2020 మార్చి నెల తొలివారం నుంచి దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి చెంది ఏడు నెలలు దాటినా కొత్త కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అనంతరం సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ప్రజలు భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజలు మాస్కులు ధరించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: కరోనా విషయంలో మరో గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదికి 10 కరోనా వ్యాక్సిన్లు..?
అయితే ఐ.సీ.ఎం.ఆర్ ఛీఫ్ బలరాం భార్గవ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కరోనా వైరస్ నిబంధనలు సుదీర్ఘ కాలం కొనసాగుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్ కతాలోని వెబినార్ కు హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజలు సుదీర్ఘకాలం పాటు మాస్కులు ధరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భారతదేశం వ్యాక్సిన్ రూపకల్పనలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని వెల్లడించారు.
Also Read: వ్యాక్సిన్ రావడం కష్టమే.. వ్యాక్సిన్లపై నిపుణుల అనుమానాలు..?
దేశంలోని 30 కోట్ల మందికి 2021 జులై నాటికి 30 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ను ఇచ్చిన తరువాత మిగిలిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. కరోనాను కట్టడి చేయడంలో మాస్కుల పాత్ర ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఐదు కరోనా వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
వ్యాక్సిన్ తో మాత్రమే కరోనాను అంతం చేయడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. కరోనా నిబంధనలు ఇకపై కూడా పాటించాల్సి ఉంటుందని అప్పుడే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని వెల్లడించారు. మాస్క్ అనేది వస్త్రరూపంలో ఉన్న వ్యాక్సిన్ అని ఆయన అభిప్రాయపడ్డారు.