ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ తో పాటు ఇతర దేశాల్లో సైతం రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారికి పరిష్కారం చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో పడ్డాయి.
Also Read: వ్యాక్సిన్ రావడం కష్టమే.. వ్యాక్సిన్లపై నిపుణుల అనుమానాలు..?
ఇప్పటికే పలు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో అద్భుతమైన ఫలితాలను సాధించాయి. ఇంటర్నేషనల్ పెడరేషన్ ఆఫ్ ఫార్మాసూటికల్ మ్యానుఫాక్యరర్స్ అండ్ అసోసియేషన్స్ డైరెక్టర్ థామస్ క్యూనీ మాట్లాడుతూ ఇప్పటివరకు మూడు కరోనా వ్యాక్సిన్లు అద్భుతమైన ఫలితాలు సాధించాయని.. వచ్చే ఏడాది వేసవికాలం నాటికి 10 నుంచి 11 కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: కరోనా విషయంలో మరో గుడ్ న్యూస్.. కొత్త అధ్యయనం ఏం చెప్పిందంటే..?
రెగ్యులేషన్ సంస్థల నుంచి అనుమతి వస్తే వ్యాక్సిన్లు ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయని క్యూనీ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ కు పేటెంట్ అడగడంలో తప్పేమీ లేదని క్యూనీ అన్నారు. పేటెంట్ వద్దనడం కంపెనీలను కించపరిచినట్లే అవుతుందని క్యూనీ పేర్కొన్నారు. ఒక వ్యాక్సిన్ కు అనుమతులు లభించాలంటే 50 క్వాలిటీ టెస్టులు చేస్తారని.. కరోనాను ఓడించేందుకే శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
అయితే ప్రస్తుతం కంపెనీలు ప్రజల ఇబ్బందులను క్యాష్ చేసుకోవని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. ఒకటికి మించి కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే మాత్రం ప్రజలకు కరోనా కష్టాలు వేగంగా తీరే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.