ఎల్‌ఐసీ పాలసీ.. రోజుకు రూ.121 ఆదాతో రూ.27 లక్షలు..?

దేశీయ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఎన్నో పాలసీలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ పాలసీలలో ఒకటైన జీవన్ లక్ష్య పాలసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువమొత్తం పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందవచ్చు. ఎల్‌ఐసీ కన్యాధాన్ పాలసీ పేరుతో కూడా పిలవబడే ఈ పాలసీ కూతురు పెళ్లి ఘనంగా చేయాలని అనుకునే వాళ్లకు బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. చాలామంది తల్లిదండ్రులు కూతురు పెళ్లి ఘనంగా జరపాలని భావిస్తారు. Also Read: వాళ్లకు టోల్ ఫీజు లేదు.. […]

Written By: Kusuma Aggunna, Updated On : February 5, 2021 1:43 pm
Follow us on

దేశీయ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఎన్నో పాలసీలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ పాలసీలలో ఒకటైన జీవన్ లక్ష్య పాలసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువమొత్తం పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందవచ్చు. ఎల్‌ఐసీ కన్యాధాన్ పాలసీ పేరుతో కూడా పిలవబడే ఈ పాలసీ కూతురు పెళ్లి ఘనంగా చేయాలని అనుకునే వాళ్లకు బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. చాలామంది తల్లిదండ్రులు కూతురు పెళ్లి ఘనంగా జరపాలని భావిస్తారు.

Also Read: వాళ్లకు టోల్ ఫీజు లేదు.. కేంద్రం కీలక ప్రకటన..?

తల్లిదండ్రులు కూతురు పుట్టిన వెంటనే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులను పొదుపు చేయడం మొదలు పెడతారు. కొందరు ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం లేదా స్థలాలు కొనడం చేస్తూ ఉంటారు. అయితే వీటి కంటే జీవన్ లక్ష్య పాలసీలో రోజుకు 121 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 27 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. నెలకు దాదాపు 3500 రూపాయలు పొదుపు చేస్తే 22 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: వాట్సాప్ సెక్యూర్ గా ఉండాలంటే చేయాల్సిన మార్పులివే..?

పాలసీ టర్మ్ 25 సంవత్సరాలు తీసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల వయస్సులో 10 లక్షల రూపాయల బీమా మొత్తానికి పాలసీని తీసుకుంటే మెచ్యూరిటీ సమయంలో 27 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయస్సులో ఉన్నవాళ్లు జీవన్ లక్ష్య పాలసీని సులభంగా తీసుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

పాలసీదారుడు మరణిస్తే ప్రీమియం చెల్లించకపోయినా కుటుంబ సభ్యులు పాలసీ డబ్బులను పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పాలసీలో చేరిన వాళ్లు ప్రతి నెలా ఎంత మొత్తం పొదుపు చేశారో ఆ మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.