https://oktelugu.com/

ఏ.ఎం.రత్నం గారిని మాత్రమే సినిమా అడిగాను: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ” ఖుషి” మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఆయనకి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాకి తమిళ దర్శకుడు ఎస్‌.జె. సూర్య దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మించారు. ఖుషి తర్వాత రత్నం గారు పవన్ తో బంగారం మూవీని కూడా నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడో మూవీ తెరకెక్కుతుంది. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ స్టార్ 27వ సినిమాకి ఏ.ఎం రత్నమే […]

Written By:
  • admin
  • , Updated On : February 5, 2021 / 10:18 AM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ” ఖుషి” మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఆయనకి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాకి తమిళ దర్శకుడు ఎస్‌.జె. సూర్య దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మించారు. ఖుషి తర్వాత రత్నం గారు పవన్ తో బంగారం మూవీని కూడా నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడో మూవీ తెరకెక్కుతుంది. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ స్టార్ 27వ సినిమాకి ఏ.ఎం రత్నమే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గురువారం నాడు రత్నం గారి పుట్టినరోజు సందర్బంగా షూటింగ్ లొకేషన్లో ఆయనని కలిసిన పవన్ శుభాకాంక్షలు తెలియచేసారు.

    Also Read: ఈసారైనా ప్రదీప్ కోరికను ‘పవర్ స్టార్’ తీరుస్తాడా !

    ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ… నా సినీ జీవితంలో ఎవర్ని నాతో సినిమా చేయమని కోరలేదు, రత్నం గారితో ఉన్న పరిచయంతో ఆయనని మాత్రమే అడిగాను. కెరీర్ తోలి నాళ్లలో ఖుషి లాంటి మూవీని నాకు అందించి ఆయనకు రుణపడిపోయేలా చేశారు. సినిమా నిర్మాణం పట్ల ఆయనలో ఒక తపన కనిపిస్తుంది. సినిమా వ్యాపార విస్తృతి తెలిసిన నిర్మాత ఆయన. సినిమాలో కళాత్మకత ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి అందించడం ద్వారా మార్కెట్ పరిధి పెంచారు.

    Also Read: ఉప్పెన ట్రైలర్ టాక్: ప్రేమ ఎప్పుడూ చరిత్రయేనా?

    పరిశ్రమలో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ నిర్మాణమవుతున్నాయి… కానీ అప్పట్లోనే రత్నం గారు ‘భారతీయుడు’ సినిమాను ‘ఇండియన్’గా బాలీవుడ్ లో రిలీజ్ చేసి ఘన విజయం సారాధించటంతో పాటు దక్షిణాది పరిశ్రమ, హీరోల, దర్శకుల సత్తా గురించి దేశమంతా తెలిసేలా చేశారని పవన్ అన్నారు. ఆయన నిర్మించే చిత్రాల్లో ప్రేక్షకుల అభిరుచికి తగ్గ అన్ని అంశాలూ ఉంటాయి… అవి ఏ భాషవారికైనా నచ్చేలా ఉంటాయి. ఆ విధంగా తెలుగు, తమిళ చిత్రాల మార్కెట్ పరిధిని విస్తరింపచేయడంలో రత్నం గారి పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన లాంటి నిర్మాత మరిన్ని సినిమాలు చేసి విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్