https://oktelugu.com/

ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. రోజుకు రూ.200 ఆదాతో చేతికి రూ.17 లక్షలు..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తూ పాలసీ తీసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ అమలు చేస్తున్న పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ కూడా ఒకటి. మెచ్యూరిటీ సమయంలో మంచి రాబడి పొందాలని భావించే వాళ్లకు జీవన్ లాభ్ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. రోజుకు 233 రూపాయలు ఆదా చేస్తే ఈ పాలసీతో ఏకంగా రూ.17 లక్షలు పొందవచ్చు. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 13, 2021 / 11:15 AM IST
    Follow us on

    దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తూ పాలసీ తీసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ అమలు చేస్తున్న పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ కూడా ఒకటి. మెచ్యూరిటీ సమయంలో మంచి రాబడి పొందాలని భావించే వాళ్లకు జీవన్ లాభ్ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. రోజుకు 233 రూపాయలు ఆదా చేస్తే ఈ పాలసీతో ఏకంగా రూ.17 లక్షలు పొందవచ్చు.

    Also Read: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త సర్వీసులు..?

    ఈ పాలసీ టర్మ్ 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు కాగా 8 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. పిల్లల పెళ్లి, ఉన్నత చదువుల కొరకు డబ్బు పొదుపు చేయాలని భావించే వాళ్లకు జీవన్ లాభ్ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. గరిష్టంగా ఈ పాలసీకి పరిమితి లేకపోవడం వల్ల ఆసక్తి ఉన్నవాళ్లు ఎంత మొత్తానికైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీని తీసుకున్న వాళ్లు లోన్ సౌకర్యం కూడా పొందవచ్చు.

    Also Read: రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..?

    ఎవరైతే జీవన్ లాభ్ పాలసీని తీసుకుంటారో వాళ్లు పాలసీని తీసుకున్న మూడు సంవత్సరాల తరువాత లోన్ పొందే అవకాశం ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో బోనస్, బీమా మొత్తం పొందే అవకాశం ఉండగా ఎల్‌ఐసీ ప్రీమియం మొత్తంపై పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 16 సంవత్సరాల కాలపరిమితితో పాలసీని తీసుకుంటే నెలకు 7,000 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    రోజుకు కనీసం 233 రూపాయల చొప్పున ఆదా చేస్తే మెచ్యూరిటీ సమయంలో 17 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి జీవన్ లాభ్ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కేవలం పది సంవత్సరాలు ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.