https://oktelugu.com/

‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’పై ప‌వ‌న్ కొడుకు స్పంద‌న‌.. ద‌ర్శ‌కుడు క్రిష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అకీరా!

ఇప్పుడు టాలీవుడ్లో తెర‌కెక్కుతున్న చిత్రాల్లో అత్యంత క్యూరియాసిటీని ఫిల్ చేస్తున్న మూవీ ప‌వ‌న్‌-క్రిష్ మూవీ. ప‌వ‌న్‌ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మొదలు సామాన్య ప్రేక్షకుల వరకూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశాడు క్రిష్‌. ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ టైటిల్ ఖరారు చేసిన దర్శకుడు.. శివ‌రాత్రి సంద‌ర్భంగా అద్వితీయంగా ప్రకటించాడు. ఈ గ్లింప్స్ లో పవన్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక, తెరపై టైటిల్ రావడానికి ముందుగా పవన్ అంతెత్తు […]

Written By:
  • Rocky
  • , Updated On : March 13, 2021 / 11:23 AM IST
    Follow us on


    ఇప్పుడు టాలీవుడ్లో తెర‌కెక్కుతున్న చిత్రాల్లో అత్యంత క్యూరియాసిటీని ఫిల్ చేస్తున్న మూవీ ప‌వ‌న్‌-క్రిష్ మూవీ. ప‌వ‌న్‌ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మొదలు సామాన్య ప్రేక్షకుల వరకూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశాడు క్రిష్‌. ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ టైటిల్ ఖరారు చేసిన దర్శకుడు.. శివ‌రాత్రి సంద‌ర్భంగా అద్వితీయంగా ప్రకటించాడు.

    ఈ గ్లింప్స్ లో పవన్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక, తెరపై టైటిల్ రావడానికి ముందుగా పవన్ అంతెత్తు నుంచి చేస్తున్న హై జంప్ చూస్తే.. దేహం రోమాంచితం అవుతుందంటున్నారు ఫ్యాన్స్. దీనికి సంగీత దిగ్గజం కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్వితీయంగా ఉందని కొనియాడుతున్నారు. ఈ క్రమంలో ఇప్ప‌టికే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుపై త‌మ స్పంద‌న తెలియ‌జేశారు.

    Also Read: RRRలో యాక్ష‌న్‌.. ఎమోష‌న్‌.. ఎన్టీఆర్ కు అది.. రామ్ చరణ్ కు ఇది!

    సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ సినిమాలో పవన్ లుక్ పై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. మహేష్ బాబుతోపాటు, పవన్ వీరాభిమాని నితిన్ కూడా ఈ గ్లింప్స్ చూసి అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇక, మెగా ఫ్యామిలీ నుంచి అందరూ పవర్ స్టార్ ను ఆకాశానికి ఎత్తేశారు. పవన్ లుక్ చూసి బన్నీ, సాయిధరమ్ తేజ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి వీరమల్లుగా తన తమ్ముడి గెటప్ చూసి అద్భుతంగా ఉందని అన్నాడు. ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడట.

    Also Read: సూపర్ హిట్ ఇచ్చినా.. ఇదెక్కడి గోలరా బాబు !

    అయితే.. అందరి కంటే ఎక్కువ పవన్ కొడుకు ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యాడ‌ట‌. రేణుదేశాయ్ – ప‌వ‌న్ కుమారుడు అకీరా నంద‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుగా త‌న తండ్రిని చూసి గూస్ బంస్ అయ్యాడ‌ట‌. ఈ గెట‌ప్ లో మీ లుక్ కేక డాడీ, ఈ సినిమా కోసం నేను ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నా అని అన్నాడు. గ్లింప్స్ లో బ‌ల్లెం ప‌ట్టుకుని యుద్ధ రంగంలోకి దిగిన తీరు అమోఘం అని స్పంద‌న తెలియ‌జేశాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఇక‌, ద‌ర్శ‌కుడు క్రిష్ ను ఆకాశానికి ఎత్తేశాడు అకీరా. మా నాన్న‌ను ఓ రేంజ్ లో చూపించార‌ని, మ‌రి, నాతో ఎప్పుడు సినిమా తీస్తార‌ని కూడా అడ‌గ‌డం విశేషం. ఈ విధంగా గ్లింప్స్ తోనే అద‌ర‌గొట్టిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ కోసం, త‌ర్వాత సినిమా కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. మొత్తానికి టైటిల్ అనౌన్స్ తోనే మంట‌లు రేపిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు.. థియేట‌ర్లో ఎలాంటి సినిమా చూపిస్తాడో చూడాలి.