https://oktelugu.com/

RRRలో యాక్ష‌న్‌.. ఎమోష‌న్‌.. ఎన్టీఆర్ కు అది.. రామ్ చరణ్ కు ఇది!

RRR సినిమాలో ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్ హీరోలు అని ప్ర‌క‌టించ‌గానే తెలుగు ప్రేక్ష‌కుల్లో ఒక అటెన్ష‌న్ వ‌చ్చేసింది. ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌ని ఒక పోటీ నెల‌కొనే రెండు కుటుంబాల‌కు చెందిన హీరోల‌తో రాజ‌మౌళి ఎలా సినిమా తీయ‌బోతున్నాడా? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌ధానమైన‌ ఆస‌క్తి. ఎవ‌రిని త‌క్కువ చేసి చూపినా ఇబ్బందే.. మ‌రెవరికి ఎక్కువ అనేలా చిత్రించినా క‌ష్ట‌మే. ఈ ఇద్ద‌రు అగ్ర‌హీరోల‌ను ఎలా బ్యాలెన్స్ చేయ‌బోతున్నాడు? అనే క్యూరియాసిటీ ప్ర‌తీ ఒక్క‌రిలో ఉందంటే అతిశ‌యోక్తి కాదు. Also […]

Written By:
  • Rocky
  • , Updated On : March 13, 2021 / 11:03 AM IST
    Follow us on


    RRR సినిమాలో ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్ హీరోలు అని ప్ర‌క‌టించ‌గానే తెలుగు ప్రేక్ష‌కుల్లో ఒక అటెన్ష‌న్ వ‌చ్చేసింది. ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌ని ఒక పోటీ నెల‌కొనే రెండు కుటుంబాల‌కు చెందిన హీరోల‌తో రాజ‌మౌళి ఎలా సినిమా తీయ‌బోతున్నాడా? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌ధానమైన‌ ఆస‌క్తి. ఎవ‌రిని త‌క్కువ చేసి చూపినా ఇబ్బందే.. మ‌రెవరికి ఎక్కువ అనేలా చిత్రించినా క‌ష్ట‌మే. ఈ ఇద్ద‌రు అగ్ర‌హీరోల‌ను ఎలా బ్యాలెన్స్ చేయ‌బోతున్నాడు? అనే క్యూరియాసిటీ ప్ర‌తీ ఒక్క‌రిలో ఉందంటే అతిశ‌యోక్తి కాదు.

    Also Read: సూపర్ హిట్ ఇచ్చినా.. ఇదెక్కడి గోలరా బాబు !

    ఈ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ నుంచీ ప్ర‌ధానంగా ఇటు మెగా అభిమానుల్లో, అటు నంద‌మూరి ఫ్యాన్స్ లో ఒక‌టే ప్ర‌శ్న‌. రాజ‌మౌళి మా హీరోను ఎలా చూపించ‌బోతున్నాడు? అయితే.. ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితులు గ‌తంలో మాదిరిగా లేక‌పోవ‌డం.. అభిమానులూ వాస్త‌వాల‌ను అర్థం చేసుకోవ‌డం.. అన్నింటిక‌న్నా ముఖ్యంగా స్టార్ డ‌మ్ కు అతీతంగా కొన‌సాగుతున్న‌ రామ్ చ‌ర‌ణ్ – ఎన్టీఆర్ స్నేహం పోటీని త‌గ్గించాయ‌ని చెప్పొచ్చు. కానీ.. ద‌ర్శ‌కుడు ఎవ‌రిని ఎలా చూపించ‌బోతున్నాడు అనే ఆ ప్ర‌శ్న మాత్రం మిగిలే ఉంది.

    అయితే.. దీనికి సంబంధించిన విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్ ను రాజ‌మౌళి ఎలా చూపించ‌బోతున్నాడు తెలిసింది. ర‌ణం.. రుధిరం.. రౌద్రం.. అనే సినిమా టైటిల్ లోనే పోరాటం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏ వైపుగా చూసినా యాక్ష‌న్ ఎవ‌రెస్ట్ ను రీచ్ అవుతుంద‌ని క్లియ‌ర్ గా అర్థ‌మ‌వుతోంది. దీంతో.. ఇద్ద‌రినీ యాక్ష‌న్ తో దుమ్ములేపుతారు అని చాలా మంది ఫిక్స్ అయ్యారు. అయితే.. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం లెక్క వేరే ఉంద‌ట‌.

    Also Read: కొత్త తెలుగు హీరోయిన్ కి దర్శకుల అభయం !

    ఈ సినిమాలో యాక్ష‌న్ పార్ట్ మొత్తం చెర్రీ టేక‌ప్ చేయ‌బోతున్నాడ‌ట‌. అల్లూరి సీతారామ రాజు అంటేనే పౌరుషం.. దాన్ని పీక్ స్టేజ్ లో ఆవిష్క‌రించ‌బోతున్నాడ‌ట రాజ‌మౌళి. ఆ విధంగా తెర‌పై రామ్ చ‌ర‌ణ్ గ‌ర్జ‌న‌కు థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లిపోతుంద‌ని స‌మాచారం. ఇక‌, జ‌క్క‌న్న హీరో సినిమాలో ప్రత్య‌ర్థుల‌పై ఏ విధంగా పోరాటం చేస్తాడో తెలిసిందే. ఆ విధంగా యాక్ష‌న్ తో దున్నేయ‌బోతున్నాడ‌ట చెర్రీ.

    ఇక‌, ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్లో మూడు షేడ్ల వ‌ర‌కూ ఉంటాయ‌ట‌. ఇందులో యాక్ష‌న్ తోపాటు పెర్ఫార్మెన్స్ కు అగ్ర‌తాంబూలం ఉంటుంద‌ట‌. ఎన్టీఆర్ ఎలాంటి న‌టుడో అంద‌రికీ తెలిసింది. ఈ సినిమాలో కొమ‌రం భీమ్ క్యారెక్ట‌ర్లో అద్భుత‌మైన నట‌న‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నాడ‌ట తార‌క్‌. న‌వ‌ర‌సాల‌ను అద్భుతంగా ప‌లికించ‌గ‌ల తార‌క్ ఈ సినిమాతో మ‌రో మెట్టు ఎక్క‌బోతున్నాడ‌ని అంటున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    మొత్తంగా.. ఈ సినిమా త‌ర్వాత‌ చెర్రీ అద్దిరిపోయే యాక్ష‌న్ హీరోగా మారిపోనుండ‌గా.. ఎన్టీఆర్ అద్భుత‌మైన పెర్ఫార్మ‌ర్ గా నిలిచిపోతాడ‌ని అంటున్నారు. మ‌రి, ఇందులో నిజం ఎంత‌? ఎవ‌రు ఏ రోల్ పోషిస్తున్నారు? జ‌క్క‌న్న వీరి పాత్ర‌ల‌ను ఏ రీతిన చెక్కాడు? అన్న‌ది తెలియాలంటే అక్టోబ‌రు 13 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.