HomeతెలంగాణKukatpally Nightlife Issues: ఇది బ్యాంకాక్ పట్టాయ కాదు.. మన కూకట్ పల్లి.. ఎంత విశృంఖలమో

Kukatpally Nightlife Issues: ఇది బ్యాంకాక్ పట్టాయ కాదు.. మన కూకట్ పల్లి.. ఎంత విశృంఖలమో

Kukatpally Nightlife Issues: పక్కనే సముద్రం.. విశాలమైన బీచ్ లు.. అందమైన రెస్టారెంట్లు.. అందులో అద్భుతం అనే విధంగా సౌకర్యాలు.. ఇవి మాత్రమే కాదు.. ముగ్ద మనోహరమైన అమ్మాయిలు.. అక్కడ లభించే రకరకాల మసాజ్ లు.. ఇలా చెప్పుకుంటూ పోతే స్వర్గం అనేది కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి అణువులోనూ దేహ ఆరాధన సాగుతూనే ఉంటుంది. ఇదంతా చదువుతుంటే బ్యాంకాక్ మీకు గుర్తుకు రాకపోతే తప్పు మాది కాదు.

బ్యాంకాక్ లో ప్రధాన ఆకర్షణ మసాజ్. మసాజ్ తర్వాత అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మన హైదరాబాద్ బ్యాంకాక్ లోని పట్టాయ నగరాన్ని మించిపోయింది. హైదరాబాద్ నగరంలో సముద్రం లేదు. చెప్పుకోవడానికి నది కూడా లేదు. హైదరాబాదులో హుస్సేన్ సాగర్ మాత్రం ఉంది. కాకపోతే అది మురికి కూపం. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కూర్చోవడానికి అవకాశం మాత్రమే ఉంటుంది. అక్కడ బీచ్ మాదిరిగా ఆస్వాదించడానికి సౌలభ్యం ఉండదు.

హైదరాబాద్ నగరం బ్యాంకాక్ మాదిరిగా మారిపోవడానికి ప్రధాన కారణం.. కొందరు యువతులు చేస్తున్న పనికిమాలిన పనులు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో వంగపహాడ్ అనే ప్రాంతంలో పనికిమాలిన వృత్తి కొనసాగేది. చాలామంది మహిళలు అనైతికమైన కార్యకాలపాలు సాగించేవారు. అక్కడ తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ నగరంలో జడలు విప్పుతోంది. ముఖ్యంగా కూకట్ పల్లి ప్రాంతంలో రాత్రి అయితే చాలు దారుణమైన కార్యకలాపాలు సాగుతున్నాయి.

కొంతమంది యువతులు నడిరోడ్డు మీద పురుషులను ఆకర్షించడానికి అత్యంత అనైతికమైన పనులు చేస్తున్నారు. ఫలితంగా కూకట్ పల్లి చరిత్రను మకిలి అంటిస్తున్నారు. పోలీసులు దాడులు చేసినప్పుడు మాత్రమే ఆ తరహ మహిళలు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కూకట్ పల్లి ఏరియాలో జరుగుతున్న దారుణాలపై కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్త విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన చాలామంది కూకట్ పల్లి కాస్త పట్టాయ నగరంగా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version