Kukis : కుకీ వివాదం.. రోజురోజుకు ఇది తీవ్రమవుతోంది. మణిపూర్ లో ఈ తెగల మధ్య గొడవ. దానికి మూలమైన ఈ అక్రమ వలసలు.. భూ ఆక్రమణలు, డ్రగ్స్ వ్యాపారం బాగా జరుగుతోంది. పక్కనున్న బంగ్లాదేశ్ కుకీతోపాటు కొన్ని తెగల వల్ల ఇబ్బందులు వస్తోంది.
మయన్నార్ లోని మిలటరీ ప్రభుత్వం మన సరిహద్దుల్లోని కొన్ని ఉగ్రవాద తెగల మీద వైమానిక దాడులు చేయడంతో భారీగా భారత్ లోకి వలసవచ్చారు. చిట్టగాంగ్ హిల్స్ ట్రాక్ దట్టమైన అడవుల ద్వారానే కుకీ తీవ్రవాదులు వస్తున్నారు. వాళ్లు తప్పించుకొని బంగ్లాదేశ్ కు, భారత్ లోకి వస్తున్నారు.
బంగ్లాదేశ్ ఆర్మీ, ర్యాపిడ్ ఆక్షన్ బెటాలియన్ వాళ్లు ఇప్పుడు కుకీ తెగల మీద కన్నేశారు. కుకీ తీవ్రవాదం ముస్లిం తీవ్రవాద సంస్థలతో టై అప్ అయ్యి కుట్రలు చేస్తున్నట్టు కనిపెట్టారు.
కుకీ నేషనల్ ఆర్మీ ఉగ్రవాద సంస్థ ఎక్కడ ఉందో కనిపెట్టి మరీ బంగ్లాదేశ్ ఆర్మీ ధ్వంసం చేసింది. వీరు అడవుల్లోకి పారిపోయారు. ఇప్పుడు వీరంతా కలిసి అక్కడ ఒక సపరేట్ రాష్ట్రం కావాలంటూ బోరుబాట పట్టారు.
బంగ్లాదేశ్ కి తలనొప్పిగా మారిన కుకీ తీవ్రవాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..