Sai Rajesh Vs Vishwak Sen: విశ్వక్ సేన్‌ మొదటి సినిమా కోసం నేను ఎంతో కష్టపడ్డాను అంటూ అసలు విషయం బయటపెట్టిన సాయి రాజేష్

Vishwak sen ఇటీవల 'పేక మేడలు' సినిమా ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ఎట్టకేలకు ఈ వివాదం గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించారు. తనకు ఆల్రెడీ ఎన్నో కమిట్‌మెంట్‌లు ఉండడం వల్ల, దర్శకుడి సమయాన్ని వృథా చేయకూడదని తాను కథను వినకూడదని నిర్ణయించుకున్నానని అతను స్పష్టం చేశాడు.

Written By: Swathi, Updated On : August 2, 2023 5:00 pm

Sai Rajesh Vs Vishwak Sen

Follow us on

Sai Rajesh Vs Vishwak Sen: సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా ఈమధ్యనే విడుదలై బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు కూడా రాని కలెక్షన్లు ఈ సినిమా తెచ్చుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

అయితే, “బేబీ” కథను సాయి రాజేష్‌ వేరే హీరోకి చెప్పడానికి వెళితే ఆ హీరో కలవడానికి కూడా నిరాకరించారు అని పలుమార్లు పలు వ్యక్తులు చెబుతూ వచ్చారు. నటుడి పేరు నేరుగా వెల్లడించనప్పటికీ, ఆ హీరో విశ్వక్ సేన్ అయి ఉండవచ్చని ఊహాగానాలు వచ్చాయి. అంతేకాకుండా విశ్వక్ సేన్, సాయి రాజేష్ మధ్య పరోక్ష ట్విట్టర్ వారు కూడా జరిగింది.

ఇటీవల ‘పేక మేడలు’ సినిమా ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ఎట్టకేలకు ఈ వివాదం గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించారు. తనకు ఆల్రెడీ ఎన్నో కమిట్‌మెంట్‌లు ఉండడం వల్ల, దర్శకుడి సమయాన్ని వృథా చేయకూడదని తాను కథను వినకూడదని నిర్ణయించుకున్నానని అతను స్పష్టం చేశాడు. ఇది తన ఇష్టమని, అందరినీ సంతృప్తి పరిచేందుకు తాను బిర్యానీ కాదన్నారు.

ఇప్పుడు ఈ వివాదానికి ప్రతిస్పందనగా, సాయి రాజేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘విశ్వక్ సేన్‌కు ‘బేబి’ కథ చెప్పాలనుకున్నది నిజమే. కానీ అతను వినలేదు. దీనికి కారణం ఏంటో కూడా నాకు తెలియదు. బహుశా అతడి ప్రయారిటీ డెరెక్టర్స్ లిస్ట్‌లో నేను లేకపోయి ఉండొచ్చు. విశ్వక్ ‘బేబి’ మూవీకి నో చెప్పిన విధానం నాకు నచ్చలేదు. అతను వద్దనుకున్న సినిమా హిట్ అయ్యింది. సక్సెస్‌ని ఎంజాయ్ చేయాలి కానీ ఎదుటివారిని అవమానించొద్దని విశ్వక్ సేన్ అనే సరికి చాలా బాధపడ్డా’’ అని సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.

‘‘అయితే ‘బేబి’ మూవీని రిజెక్ట్ చేశాడని అన్నాను గానీ ఎక్కడా కూడా అతని పేరు చెప్పలేదు. హీరోల రిజెక్షన్ అనేది రెస్పెక్టబుల్‌గా ఉంటే బాగుంటుందనేది నా ఒపీనియన్. ఈ విషయంలో నాకు విశ్వక్ మీద ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే అతను హీరోగా చేసిన ఫస్ట్ ఫిలిం ‘వెళ్లిపోమాకే’ రిలీజ్ కోసం నేనెంతో కష్టపడ్డాను. అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతలకు చూపించి, ఆ చిత్రాన్ని విడుదల చేయించాను’’ అన్నాడు.

ఇక సాయిరాజేష్ తెలిపిన ఈ మాటలకు మరలా విశ్వక్ స్పందిస్తారో లేదో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.