KGF2 5 Days Collections: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` హిందీ బాక్సాఫీస్ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. హిందీ బెల్ట్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తొలి రోజు రూ. 20 కోట్లకు పైగా వసూలు చేయగా, KGF 2 మాత్రం దానికి రెట్టింపు సుమారు రూ. 45 కోట్లు తొలి రోజే కలెక్షన్స్ ను రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ ఈ చిత్రం హిందీలో సరికొత్త చరిత్రను సృష్టించింది.

బాలీవుడ్ మార్కెట్ లో ₹ 200 కోట్ల క్లబ్ లోకి చాలా స్పీడ్ గా వెళ్ళిన చిత్రంగా ఈ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. `కేజీఎఫ్ చాప్టర్- 2′ ఈ రోజు (సోమవారం, 5వ రోజు)తోటి వచ్చే కలెక్షన్స్ తో ₹ 200 కోట్లు మార్క్ ను దాటబోతుంది. ‘బాహుబలి 2′ 6వ రోజుకు గానూ ₹ 200 కోట్ల మార్క్ ను దాటలేదు.
అలాంటిది.. `కేజీఎఫ్ 2’ మాత్రం కేవలం 5 రోజులకే ఈ మార్క్ ను దాటుతుండటం విశేషం. ఇంతకీ `కేజీఎఫ్ 2’కి మొదటి నాలుగు రోజులకు గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే..
Also Read: RRR OTT Release Date: RRR మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది
సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం నాడు – 53.95 కోట్లు,
శుక్రవారం నాడు – 46.79 కోట్లు,
శనివారం నాడు – 42.90 కోట్లు,
ఆదివారం నాడు – 50.35 కోట్లు.
మొత్తం నాలుగు రోజులకు గానూ `కేజీఎఫ్ 2′ ₹ 193.99 కోట్లు కలెక్ట్ చేసింది
ఈ రోజు ఈ చిత్రానికి మరో ముప్పై కోట్లు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి.. హిందీలో `కేజీఎఫ్ 2′ క్రియేట్ చేసిన రికార్డ్స్.. ఇప్పట్లో మరో ఏ సినిమా బ్రేక్ చేయలేదు. ఇప్పుడు ఈ టాపిక్ బాలీవుడ్ స్టార్ హీరోలకు పెద్ద తలనొప్పి అయిపోయింది. నిజానికి ఈ స్థాయి కలెక్షన్స్ అక్కడి స్టార్ హీరోలకు కూడా రావడం లేదు. అంటే… ఒక సౌత్ హీరో కంటే.. తమ మార్కెట్ తక్కవా అనే ఆలోచనను కూడా హిందీ హీరోలు జీర్ణించుకోలేకపోతున్నారు.
పైగా ఈ సినిమాకు రిలీజ్ అయిన అన్ని చోట్ల నుంచి మంచి ఆదరణ వస్తోంది. హిందీలో రానున్న రోజుల్లో ఈ సినిమాకి ఇంకా బెటర్ కలెక్షన్స్ రావొచ్చు అని ట్రేడ్ పండితులు కూడా అంచనా వేస్తున్నారు. ఇదే నిజం అయితే.. హిందీ హీరోలు ఇక ఇగో రగిలిపోతూ కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయం.
Also Read: Honour Killing Telangana: మర్డర్ ‘మామ’లు.. ప్రేమ.. పెళ్లి.. అల్లుళ్ల హత్యలు
[…] […]