KGF Chapter 2 Collections: నాలుగు రోజుల క్రితం బాక్స్ ఆఫీస్ వద్ద KGF చాప్టర్ 2 అనే సినిమా రూపం లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి ప్రారంభం అయినా సంగతి మన అందరికి తెలిసిందే..నాలుగు రోజుల పాటు ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద విలయతాండవం చేసింది అనే చెప్పాలి..ఎక్కడ చూసిన గౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కేవలం వీకెండ్ నుండే 530 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సరికొత్త ప్రభంజనం సృష్టించింది ఈ చిత్రం..అతి త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి కూడా చేరి ఇండియా లోనే ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒక్కటిగా నిలవబోతుంది..అన్ని బాషలలో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, సోమవారం నుండి దారుణమైన డ్రాప్స్ ని దక్కించుకుంది..రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం పని దినాలలో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ సెన్సేషన్ సృష్టించింది..KGF చాప్టర్ 2 కూడా అదే స్థాయిలో రన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు..కానీ ఆ స్థాయి వసూళ్లు సోమవారం నుండి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా దాదాపుగా 79 కోట్ల రూపాయిల ప్రీ రిలీస్ బిజినెస్ జరిగింది..ఒక్క డబ్బింగ్ సినిమాకి ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఏమిటి..ఇంత వసూళ్లు మన తెలుగు స్టార్ హీరోలకే సాధ్యపడదు అంటూ చాలా మంది అనుకున్నారు..అయితే ఈ సినిమాని నిర్మించిన హోమబుల్ సంస్థ వాళ్ళు ఈ సినిమాకి తెలుగు లో స్టార్ హీరో సినిమా స్థాయి క్రేజ్ ఉంది, కచ్చితంగా ఈ బిజినెస్ ని మా సినిమా రికవర్ చేస్తుంది..ఒక్కవేల చెయ్యకపోతే మేము నిర్మిస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గారి సలార్ మూవీ బిజినెస్ లో బాగా డిస్కౌంట్ ఇష్టము అంటూ బయ్యర్స్ కి ధైర్యం ని నింపారు..కానీ మొదటి వీకెండ్ లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా స్టార్ హీరో సూపర్ హిట్ సినిమా స్థాయిలోనే వసూళ్లు దక్కాయి..కేవలం నాలుగు రోజుల్లోనే ఈ రెండు ప్రాంతాలకు కలిపి ఈ సినిమా దాదాపుగా 53 కోట్ల రూపాయిలు వసూలు చేసింది..ఇదే ఊపు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవడం అంత కష్టం ఏమి కాదు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి..కానీ సోమవారం నాడు ఈ సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ షాక్ కి గురి అయ్యింది.

Also Read: KGF2: ఇంత అద్భుతంగా కేజీఎఫ్2 ఫైనల్ కట్ చేసిన ఎడిటర్ ఈ 19 ఏళ్ల కుర్రాడని తెలుసా?
హైదరాబాద్ వంటి సిటీ లో ఈ సినిమాకి మొదటి సోమవారం నాడు కనీసం 20 శాతం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు..దీనితో సిటీ లో ఉన్న ఎన్నో మల్టీప్లెక్స్ షోస్ భారీగా రద్దు అయ్యాయి, ఇటీవల వచ్చిన అన్ని బ్లాక్ బస్టర్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ కంటే KGF హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా తక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి..#RRR సినిమాకి సోమవారం నాడు దాదాపుగా 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ ని కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలు చేసింది..ఇక ఆ తర్వాత పుష్ప సినిమా 1 కోటి 60 లక్షల రూపాయిలు మరియు భీమ్లా నాయక్ సినిమా 1 కోటి 30 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి టాప్ 3 గా నిలిచాయి..కానీ KGF చాప్టర్ 2 మాత్రం కేవలం 1 కోటి 20 లక్షల రూపాయిలు మాత్రమే వసూలు చేసి టాప్ 4 చిత్రం గా నిలిచింది..ఇక ఆంధ్ర లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేదు..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 వ రోజున దాదాపు గా ఈ సినిమా 5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని అంచనా..ఆదివారం తో పోలిస్తే సోమవారం కలెక్షన్స్ దాదాపుగా 50 శాతం కి పైగానే డ్రాప్స్ అయ్యాయి అంటే ఈ సినిమా మిగిలిన రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అంత తేలికైన పని కాదు అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
Also Read: KGF 2 4 Days Collections: KGF Chapter2 4 రోజుల వసూళ్లు