Homeజాతీయ వార్తలుKCR Vs BJP: వెంటపడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను వేటాడుతున్న కేసీఆర్!

KCR Vs BJP: వెంటపడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను వేటాడుతున్న కేసీఆర్!

KCR Vs BJP: ‘కంట పడ్డావా కనికరిస్తామేమో.. కానీ వెంటపడ్డావా? వేటాడేస్తాం’ అన్న తరహాలో ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలను వేటాడుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేసీఆర్ ఎదురించి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్, రఘునందన్ రావులు ఒకప్పుడు కేసీఆర్ సహచరులు. కానీ ఆ తర్వాత విభేదాలతో విడిపోయి బీజేపీలో చేరి టీఆర్ఎస్ ను ఓడించి మరీ గెలిచారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా తొడగొడుతున్నారు.

KCR Vs BJP
KCR Vs BJP

అందుకే వారంటేనే పొడగిట్టని కేసీఆర్ వాళ్లను అసెంబ్లీలో కూడా చూసేందుకు ఇష్టపడడం లేదు. అందుకే తెలంగాణ అసెంబ్లీ తొలిరోజే వారిని సస్పెండ్ చేయించారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు ఈ అసెంబ్లీలో అస్సలు వాయిస్ లేకుండా చేశారు.

దీనిపై ఆ మగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టుకు ఎక్కినా ఊరట దక్కలేదు. ఎలాగైనా సరే బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ ను ఎండగట్టాలని ముగ్గురు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుదలగా ఉన్నారు. అలాంటి ఛాన్స్ ఇవ్వబోమని టీఆర్ఎస్ కూడా అంతే పట్టుదలగా ఉంది. కోర్టుకెక్కినా బీజేపీ ఎమ్మెల్యేలకు ఊరట దక్కలేదు. డివిజన్ బెంచ్ కు వెళ్లగా చివరి రోజు సభకు హాజరయ్యే మార్గం లభించింది. కానీ స్పీకర్ అంగీకరిస్తేనేనని హైకోర్టు స్పష్టం చేసింది.

Also Read: Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌ కుమార్‌ పేరు మీద రహదారి

మంగళవారం ఉదయం స్పీకర్ ఎదుట హాజరు కావాలని.. స్పీకర్ అనుమతిస్తేనే సభకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. ఈ విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. ఈ తీర్పు సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

బీజేపీ ఎమ్మెల్యేలు తప్పు చేసినట్టుగా ఆధారాలు లేవని.. ప్రజా ప్రతినిధులు సభలో ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని హైకోర్టు కాస్త కఠువుగానే చెప్పింది. అయితే స్పీకర్ అధికారాల్లో మాత్రం జోక్యం చేసుకునేదానికి నిరాకరించి బీజేపీ ఎమ్మెల్యేలకు షాకిచ్చింది.

దీంతో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు స్పీకర్ చేతుల్లోకి వెళ్లింది. కానీ సీఎం కేసీఆర్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు సభకు హాజరు కావాలని డిసైడ్ అయ్యాడు. బడ్జెట్ పై ఆయన సమాధానం ఇవ్వనున్నాడు.

కేసీఆర్ కు సూతారం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఉండడం.. వారి ముఖం చూడడం ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యమే. దీంతో కేసీఆర్ కు ఇష్టం లేకుండా స్పీకర్ వారిని సభలోకి అనుమతించడం అసాధ్యం. దీంతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కేసీఆర్ ముందు గళం విప్పడం ఈసారి కష్టమే. తెలంగాణ స్పీకర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చినా ఆయన తీసుకోలేదు. అంతటి విశిష్ట అధికారాలు స్పీకర్ కు ఉంటాయి. దీంతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల కల ఈసారికి అసెంబ్లీలో తీరడం కష్టమేనంటున్నారు.
Also Read: Komatireddy Venkat Reddy Meets Modi: అర‌గంట‌లోనే కోమ‌టిరెడ్డికి ప్ర‌ధాని అపాయింట్ మెంట్‌.. ఏం జ‌రుగుతోంది..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] Telangana Assembly Session 2022: తెలంగాణ శాసనసభ సమావేశాలు ముగిశాయి. చివరి రోజు సీఎం కేసీఆర్ పలు వరాలు కురిపించారు. అదే సందర్భంలో కేంద్రంపై తన అక్కసు వెళ్లగక్కారు. క్షేత్ర సహాయకులను విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిపారు. మెప్మా సిబ్బందికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో సభలో హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు సైతం సీఎం చర్యలకు మద్దతు తెలిపారు. సీఎం నిర్ణయాలు భేషుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు దీంతో సభ నిర్వహణ అంతా సజావుగా సాగింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular