PM Modi-Annamalai : అన్నామలై రామేశ్వరంలో పాదయాత్ర మొదలైన రోజు నుంచి రెండు మూడు రోజుల్లో పల్లడంలో జరగబోయే బహిరంగ సభ వరకూ బీజేపీ ఎలా మార్పు చెందిందో అందరూ కేస్ స్టడీగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చిన్న విషయం కాదు. పాదయాత్ర నుంచి ప్రజా ఉద్యమంగా మారింది.
రామేశ్వరంలో మొదలుపెట్టినప్పుడు అందరూ నవ్వారు. బీజేపీ పాదయాత్ర ఏంటని ఎద్దేవా చేశారు. నో బడీ కేర్స్ బీజేపీ అన్నారు. ఆరోజు వరకూ ఎవరికీ నమ్మకం లేదు. మొదలయ్యాక దక్షిణ తమిళనాడులో ప్రభావం వచ్చింది. జనం వచ్చారు. ఉత్తర తమిళనాడు వరకూ వచ్చేసరికి ఇదో ఉధృతమైంది. మంత్రులు, అన్నాడీఎంకే, డీఎంకే నుంచి నిరసనలు, ప్రతీకారాలు మొదలయ్యాయి.
అంటే బీజేపీ పెరిగిందనే అర్థం. తమిళనాడు ప్రజల్లో ఎక్కడ మార్పు వచ్చింది.? అన్నామలై పాదయాత్రకు ఎలా వస్తున్నారో జనం అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ముగింపు సభకు మోడీ వస్తున్నారు. అన్నామలై పాదయాత్రకు విపరీతమైన జనం వస్తున్నారు. స్వతాహాగా స్పందిస్తున్నారు.
మోడీ, అన్నామలై గాలి తమిళనాట సునామీగా మారింది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.