https://oktelugu.com/

Chiranjeevi: డ్యాన్స్ లో చిరుకి పోటీ ఇచ్చింది… కట్ చేస్తే శవం అయి కనిపించిన ఆ స్టార్ హీరోయిన్…

ఒకప్పుడు 19 సంవత్సరాలకే ఒక హీరోయిన్ స్టార్ స్టేటస్ ని అనుభవించి, 20 సంవత్సరాలు నిండకుండానే మరణించడం అనేది సినిమా ఇండస్ట్రీని సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన అనే చెప్పాలి ఆ నటి ఎవరంటే...

Written By:
  • Gopi
  • , Updated On : February 24, 2024 / 04:52 PM IST
    Follow us on

    Chiranjeevi:  సినిమా ఇండస్ట్రీ అనేది జూదం లాంటిది. ఎప్పుడు ఎవరికీ ఇక్కడ సక్సెస్ వస్తుందో ఎవరికి తెలియదు.ఒక శుక్రవారం ఒక హీరో స్టార్ హీరోగా మారితే, మరొక శుక్రవారం ఇంకో హీరో స్టార్ హీరో రేంజ్ ని సొంతం చేసుకుంటాడు. అందుకే ఇక్కడ ఎవరూ ఏ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో చెప్పడం చాలా కష్టం తో కూడుకున్న పని. కాయిన్ పైకి విసిరేస్తే అది ఒకసారి హెడ్స్ పడొచ్చు, మరొక సారి టేల్స్ పడొచ్చు . ఇక్కడ ఉన్న నటి నటుల పరిస్థితి కూడా అలాంటిదే…ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు 19 సంవత్సరాలకే ఒక హీరోయిన్ స్టార్ స్టేటస్ ని అనుభవించి, 20 సంవత్సరాలు నిండకుండానే మరణించడం అనేది సినిమా ఇండస్ట్రీని సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన అనే చెప్పాలి ఆ నటి ఎవరంటే అందాల తార ‘దివ్య భారతి’…

    బి గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘ బొబ్బిలి రాజా’ సినిమాతో 1990 వ సంవత్సరం లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన దివ్యభారతి. ఈ సినిమాతో ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన రౌడీ అల్లుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఆ సినిమాలో చిరంజీవితో పాటు పోటీపడి డాన్స్ చేసి మెప్పించిన నటి దివ్యభారతి కావడం విశేషం…

    ఇక రౌడీ అల్లుడు సినిమాలో ఒక సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో దివ్యభారతికి 104 డిగ్రీల జ్వరం వచ్చిందట. ఆమెను చూసి చిరంజీవి లాంటి స్టార్ హీరోనే షూట్ కాన్సల్ చేయండి మరో రోజు పెట్టుకుందాం అని చెప్పారట. కానీ దివ్యభారతి మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకుండా బాడీ లో ఉన్న మొత్తం ఎనర్జీ ని తెచ్చుకొని షూట్ చేద్దామని డైరెక్టర్ తో చెప్పి మరి ఆ సాంగ్ షూట్ లో పాల్గొందట. ఆ పాట ఏంటంటే ‘తద్దినికా తప్పదికా ‘ అనే పాట.. దీంట్లో చాలా గ్రేస్ తో వేసే స్టెప్పులు ఉన్నాయట. దాంతో ఆ స్టెప్పులు ఆమె ఎలా వేస్తుంది అని చిరంజీవి కూడా కంగారు పడ్డాడట. కానీ ఆమె అంత జ్వరంలో కూడా సాధా సిదా స్టెప్పులేమి వేయలేదు. చిరంజీవికి పోటీ ఇస్తూ ఆయన రాజసం తో పోటీ పడి మరి ఆయన గ్రేస్ ను అందుకుంటూ స్టెప్పులు వేస్తుంటే, అవి చూసిన చిరంజీవి సైతం ఆశ్చర్యానికి గురి అయ్యాడట.

    షూటింగ్ ప్యాకప్ చెప్పాక చిరంజీవి ఆమె డెడికేషన్ కి మెచ్చుకొని చప్పట్లు కొడుతూ చెప్పిన మాట ఏంటంటే..’ నువ్వు ఫ్యూచర్లో చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. అంత జ్వరంలో కూడా నాతో పాటు పోటీపడి స్టెప్పులు వేసావంటే నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ ‘ అంటు ఆయన చెప్పిన మాటలు విన్న సెట్లో ఉన్న వాళ్ళందరూ ఆమె డెడికేషన్ ను మెచ్చుకుంటూ క్లాప్స్ కొట్టారట. అప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు. తన అందంతో, అభినయంతో కుర్రకారుల మతులు పోగొట్టిన దివ్యభారతి.. రెండు మూడు దశాబ్దాల పాటు హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీని ఏలుతుందని అని అందరూ అనుకున్నారు. కానీ తను 20 సంవత్సరాలు నిండకుండానే చనిపోవడం అనేది నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విషయం అనే చెప్పాలి…