Sooryavansham Movie : 57 ఏళ్ల హీరోకు 40 ఏళ్ల యాక్టర్ తల్లిగా..  ఫలితం అట్టర్ ప్లాఫ్..

అయితే సీనియర్ అమితాబ్ సరసన రాఖీ లేదా వహీదా రెహమాన్ వంటి యాక్టర్లు చేసి ఉంటే జోడీ బాగుండేది. అంతే కాకుండా అమితాబ్‌ యువకుడిగా కనిపించడం ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. సినిమాను దెబ్బతీయడానికి ప్రధాన కారణం క్యాస్టింగ్ ఎంపిక లేకపోవడమే.

Written By: NARESH, Updated On : August 6, 2023 6:35 pm
Follow us on

Sooryavansham Movie : ఒక భాషలో హిట్టయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. అయితే తమిళం, తెలుగులో సూపర్ హిట్టయిన ఓ సినిమాను బాలీవుడ్ రీమేక్ చేస్తే అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. అయితే సినిమా కథాబలం బాగున్నా, క్యాస్టింగ్ ఎంపిక సరిగా లేక అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది.

తమిళ సూపర్ హిట్ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేశ్ హీరోగా సూర్యవంశం మూవీ చేశాడు. ఇదే సినిమాను బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబచ్చన్ రీమేక్ చేశాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఇందులో తనకన్నా వయసు తక్కువగా ఉన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమితాబ్ కు తల్లిగా, భార్యగా చేయడం విశేషం.

1998లో ఈవీవీ సత్యనారాయణ రూపొందించిన హిందీ చిత్రం ‘సూర్యవంశం’. ఇందులో 40 ఏళ్ల నటి 57 ఏళ్ల హీరో అమితాబ్ బచ్చన్‌కు తల్లిగా నటించింది.  సూర్యవంశం సినిమా తరచూ టీవీలో వస్తుంటుంది. అమితాబ్ ఈ చిత్రంలో తండ్రిగా ఠాకూర్ భాను ప్రతాప్, కొడుకుగా హీరా ఠాకూర్‌గా ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో హీరా భార్య రాధగా సౌందర్య నటించగా, భాను ప్రతాప్ భార్య శారదగా జయ సుధ నటించింది.

అభిషేక్ ను తీసుకుందామనుకున్నా..?
దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాలో అమితాబ్, అభిషేక్‌లను తీసుకుందామని అనుకున్నాడు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, ముఖేష్ రిషి తదితర పేరున్న యాక్టర్లు నటించారు. ఈ చిత్రం కోసం మేకర్స్ ముందుగా తండ్రీ కొడుకులైన అమితాబ్, అభిషేక్‌లను తీసుకోవాలని భావించారు. 57 ఏళ్ల అమితాబ్ తల్లి పాత్రలో జయసుధ చేశారు. ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి అమితాబ్ వయస్స 57 ఏళ్లు. అలాగే కొడుకు క్యారెక్టర్ కూడా అమితాబే చేశాడు. కొడుకు క్యారెక్టర్ కు జోడి గా సౌందర్య చేశారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఇంకా ఎక్కువ. దీంతో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ జనాలకు నచ్చలేదు. 57 ఏళ్ల అమితాబ్ తల్లి పాత్ర చేసిన జయ సుధ వయసు అప్పటికి 40 ప్లస్.

అయితే సీనియర్ అమితాబ్ సరసన రాఖీ లేదా వహీదా రెహమాన్ వంటి యాక్టర్లు చేసి ఉంటే జోడీ బాగుండేది. అంతే కాకుండా అమితాబ్‌ యువకుడిగా కనిపించడం ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. సినిమాను దెబ్బతీయడానికి ప్రధాన కారణం క్యాస్టింగ్ ఎంపిక లేకపోవడమే.

డబ్బింగ్ చెప్పిన రేఖ ఈ చిత్రంలో జయ సుధ, సౌందర్యలకు రేఖ డప్పింగ్ చెప్పడం అప్పట్లో ఓ సెన్సేషన్. భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్నా సినిమా మాత్రం సక్సెస్ కాలేదు. ఈ సినిమా ప్లాఫ్ గా నిలిచింది. సూర్యవంశం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹ 10.51 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో రూ.9.26 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.1.25 కోట్లు వసూలైంది.

  • అజయ్ యాదవ్