https://oktelugu.com/

Miss Shetty Mr Polishetty Collections: సోమవారం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి బాక్సాఫీస్ వద్ద ఊహించిని రిజల్ట్!

మొదటి రోజు 2. 4 కోట్లు, రెండో రోజు 2. 23 కోట్లు, మూడో రోజు 3. 3 కోట్లు, నాలుగో రోజు 3. 8 కోట్ల నెట్ వసూళ్లు చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఐదు రోజు 1. 75 కోట్లు నెట్ రాబట్టింది.

Written By:
  • Shiva
  • , Updated On : September 12, 2023 / 11:32 AM IST

    Miss Shetty Mr Polishetty Collections

    Follow us on

    Miss Shetty Mr Polishetty Collections: సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” సినిమా సెప్టెంబర్ 7 న విడుదలై డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు సాధిస్తూ విజయం దిశగా అడుగులు వేస్తుంది. సినిమా విడుదలైన నాటి నుంచి మొన్నటి ఆదివారం వారం రోజు రోజుకు వసూళ్లు స్థాయి పెంచుకుంటూ వెళ్లిన ఈ సినిమా సోమవారం రోజు కొంచెం తక్కువ వసూళ్లు మాత్రమే చేసింది. కానీ సోమవారం రోజు కూడా ఆ స్థాయి కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు.

    మొదటి రోజు 2. 4 కోట్లు, రెండో రోజు 2. 23 కోట్లు, మూడో రోజు 3. 3 కోట్లు, నాలుగో రోజు 3. 8 కోట్ల నెట్ వసూళ్లు చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఐదు రోజు 1. 75 కోట్లు నెట్ రాబట్టింది. మరోపక్క జవాన్ లాంటి మాస్ సినిమా పోటీలో ఉన్న కానీ తెలుగు పరంగా ఆ సినిమాకు సరిసమానంగా వసూళ్లు చేసింది ఈ సినిమా. ముఖ్యంగా నాలుగో రోజు తెలుగు జవాన్ వసూళ్లు 3. 7 కోట్లు సాధిస్తే , మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా 3. 8 కోట్లు సాధించి తన సత్తా ఏమిటో చూపించింది.

    దీనితో ఓవరాల్ గా మొదటి ఐదు రోజుల్లో 13. 48 కోట్ల నెట్ వసూళ్లు చేసింది ఈ సినిమా. మరోపక్క ఓవర్శిస్ లో కూడా వన్ మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో ఈ సినిమాకు సోలో రిలీజ్ దొరికిందని చెప్పాలి. జవాన్ మినహా మరో తెలుగు సినిమా పోటీలో లేకపోవడం ప్లస్ అనే చెప్పాలి. పైగా అటు యూత్ ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు.

    నవీన్ మార్క్ కామెడీ ఈ సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. మరోపక్క అనుష్క కూడా చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద సందడి చేసింది. నిజానికి ఈ సినిమాలో మొదట అనుష్క ను హీరోయిన్ గా అనుకోలేదు.డిఫరెంట్ స్టోరీ ఉందని తెలుసుకుని దర్శకుడిని పిలిపించుకొని స్టోరీ వినింది అనుష్క. ఆమెకు కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తానని చెప్పడం, పక్కనే ఉన్న యువీ క్రియేషన్స్ టీమ్ రంగంలోకి దిగి సినిమాను నిర్మించటం చకచకా జరిగిపోయాయి .