JanaSena Party Formation Day March 14: మార్చి 14వ తేదీ జనసేనకు, పవన్ కళ్యాణ్ కు కీలకం కాబోతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. జనసేన ఆవిర్భావం దినోత్సవం ఏపీలోని కాజాలో జరుగబోతోంది. ఈ సమావేశం ఎందుకు కీలకం అంటే.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నేపథ్యంలో జరిగే సభ కాబట్టి.. ఈ ఆవిర్భావ సభకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. దీంతో ఇక పవన్ ఏపీ రాజకీయాల్లో కనబడడని.. సినిమాలకే పరిమితం అవుతాడని అందరూ భావించారు. మళ్లీ 5 ఏళ్ల తర్వాతే వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు.
Also Read: IPL 2022 Full Schedule: ఐపీఎల్ 2022 షెడ్యూల్ ఇదీ.. పాత ఫైనలిస్టుల మధ్య తొలి పోటీ
ఫుల్ టైం కార్యకర్తగా ఉండకున్నా.. మధ్యలో ఓడిపోయానన్న భావన ఎక్కడ లేకున్నా..మ ధ్య మధ్యలో ప్రజల్లోకి వస్తూనే ఏపీ రాజకీయాలను వదిలిపెట్టలేదు. జనంలో మూడో ప్రత్యామ్మాయంగా ఎదుగుతూ సీరియస్ పొలిటిషన్ గా అవతరిస్తున్నారు.
మిగత రాజకీయాలకు భిన్నంగా జనసేన వెళుతోంది. నీట్ , అవినీతి రహిత రాజకీయాలు చేస్తోంది. పవన్ సినిమాలు చేస్తేనే జనసేనకు ఆదాయం. ఆర్థిక వనరులు చాలా తక్కువ. అందుకే పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి సినిమాల ఆదాయంతో ఇప్పుడు ఏపీలో పార్టీని నిలబెట్టి 2024 ఎన్నికల్లో ఏపీ రాజకీయాలను ఏలాలని పవన్ బయలు దేరుతున్నారు.పవన్ కళ్యాణ్ కు మార్చి 14 ఎందుకు కీలకం అన్న దానిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
Also Read: Radhe Shyam : ‘రాధేశ్యామ్’ సెన్సార్ పూర్తి అయ్యింది.. నిడివి ఎంతంటే ?