Pawan Kalyan Yagam : ధర్మం కోసం నాడు ధర్మరాజు నిలబడ్డాడు. మాట తప్పని మడమ తిప్పకుండా లోక కళ్యాణం చేశాడు. ప్రజల కోసం ఎందరో రాజులు యజ్ఞాలు, యాగాలు చేసి సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. అప్పటిదాకా ఎందుకు మన పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ సైతం ఇదే యజ్ఞాలు, యాగాలతో ఒకసారి రెండు సార్లు అధికార పీఠం సంపాదించారు. ముఖ్యంగా రాజశ్యామల యాగం చేస్తే అధికారం ప్రాప్తిస్తుందని ఇటు కేసీఆర్, అటు జగన్ కూడా పాటించి సక్సెస్ అయ్యారు.. అందుకే యజ్ఞాలు, యాగాలను నాడు రాజులు చేశారు. నేడు మన నేతలూ అనుసరిస్తున్నారు.
కానీ మన పవన్ మాత్రం ప్రజల కోసం నిలబడ్డాడు. ధర్మ పరిరక్షణ కోసం పట్టుపట్టారు. ప్రజాక్షేమం, సామాజిక పరివర్తన కోరుతూ జనసేన అధినేత పవన్ ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో యాగం చేపట్టారు. ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ఈ యాగం దిగ్విజయంగా సాగింది.
ఉదయం 6.55 గంటలకు సంప్రదాయ వస్త్రధారణతో పవన్ యాగశాలకు వచ్చి ఆకట్టుకున్నారు. దీక్ష చేపట్టారు. దేవతామూర్తులకు యంత్ర స్థాపన చేశారు. హోమం చేశారు. రేపటి వరకూ ఈ యాగం కొనసాగుతుంది.

నిన్నటి వరకు సన్నని గెడ్డం తో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు యాగం కోసం ఆ గెడ్డం ని తీసి వేసాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న షూటింగ్స్ అన్నీ సన్నని గెడ్డం తో చేస్తున్నవే. పవన్ కళ్యాణ్ రీసెంట్ టైం లో ఇలాంటి లుక్స్ తో సినిమాలు చెయ్యలేదు. ఇక పోతే వారాహి యాత్ర ఉభయగోదావరి జిల్లాల్లో సాగబోతోంది. 24 వ తారీఖు వరకు ఈ మొదటి విడత యాత్ర ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోగజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఈ వారాహి టూర్ ని నిర్వహించబోతున్నారు అట. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ తో పొత్తు ఉందని అధికారికంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్, అతి త్వరలోనే ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నాం.., ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నామనే అంశాల పై కూడా అధికారికంగా ప్రకటించబోతున్నాడు. అంతే కాదు ఈ మొదటి విడత యాత్రలోనే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోతున్న స్థానాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
మొత్తంగా ధర్మ పరిరక్షణ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా యాగం చేస్తున్న తొలి నాయకుడు పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.