Pawan Kalyan: తెలంగాణ కోసం నాటి నుంచి నేటి శ్రీకాంతాచారి సహా 1000 మందికి పైగా బలిదానాలు చేశారు. వారి త్యాగ ఫలమే తెలంగాణ.. తెలంగాణలో ఏపీలాగానే వందల కులాలు ఉన్నాయి.. కానీ తెలంగాణలో కులం కంటే ‘నాది తెలంగాణ’ అన్న భావన అందరిలోనూ ఉంటుంది.. కానీ ఏపీలో అదేం ఏడ్చిచచ్చింది.. కులాల కోసం కొట్టుకు చస్తారు.. ఆంధ్రా అన్న భావనే లేదు. అందుకే మన రాష్ట్రం ఇలా ఏడ్చింది’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళగిరిలో జనసైనికులతో మీటింగ్ లో పవన్ కళ్యాణ్ వీరావేశంతో మాట్లాడారు.

తెలంగాణలో కులాల కంటే తమ ప్రాంత అస్తిత్వానికి పెద్దపీట వేస్తారని.. కానీ ఆంధ్రాలో కులాల కోసం కొట్టుకు చస్తారని.. ఎదుటివాళ్లపై ఆధిపత్యం కోసం సొంత కులాల వారినే తొక్కేస్తారంటూ ఏపీ ప్రజలు, నేతల తప్పులపై పవన్ కళ్యాణ్ ఆవేదన భరిత ప్రసంగం చేశారు. తెలంగాణ వారిని చూసి నేర్చుకొని వారిలో ఉద్యమపంథా.. స్ఫూర్తిని ఏపీ ప్రజలు పాటించాలని.. అందుకే తెలంగాణ అంటే తనకు అంత ప్రేమ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ మంచితనం చూశారని.. ఇప్పుడు ‘రండి రా నా కొడుకల్లారా’ అంటూ పవన్ నిప్పులు చెరిగారు. ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసి నా కొడుకులు అంటూ విరుచుకుపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేసే వైసీపీ నాయకులను చెప్పు తీసుకొని కొడతానంటూ మునుపెన్నడూ లేనంతగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన చెప్పు తీసి మరీ చూపించారు.
తన మూడు పెళ్లిళ్లపై అవాకులు చెవాకులు పేలుతున్న వైసీపీ నేతలకు పవన్ గట్టి కౌంటర్లు ఇచ్చారు. ఒకరిని పెళ్లి చేసుకొని 30 మంది స్టెపిన్ లతో తిరిగే సన్నాసులకు తాను సమాధానం చెప్పాలా? అంటూ మండిపడ్డారు. వైసీపీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ చేశారు.
‘ఏరా వైసీపీ గుండాల్లారా ఇప్పటివరకూ తనలో మంచితనమే చూశారు. వైసీపీలో కూడా బాలినేని లాంటి కొందరు మంచి వాళ్లు కూడా ఉన్నారు. కానీ వైసీపీవి క్రిమినల్స్ పాలిటిక్స్.. తాను బలమైన సిద్ధాంతంతో రాజకీయాలు చేస్తున్నా’నంటూ తొలిసారి పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.
తెలంగాణ ప్రజల్లోలాగా ఆంధ్రా ప్రజల్లో ఆ స్ఫూర్తి, ఉద్యమ ఆకాంక్ష బలమైన నేపథ్యాలు లేవంటూ పవన్ కళ్యాణ్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ మాటలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.