Ram Temple : బాల రాముడి ప్రాణప్రతిష్టకు సరిగ్గా ఇంకా రెండు రోజులు ఉంది. సోమవారం జరిగే ఈ ప్రతిష్టాపన కార్యక్రమం దేశమంతా తన్మయత్వంలోకి నెట్టింది. కులం, ప్రాంతం తేడా లేదు. మణిపూర్ నుంచి కచ్ వరకూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అందరూ తన్మయత్వంతో తేలియాడుతున్నారు.
నిజానికి ఒక్క భారత్ నే కాదు.. ఇండినోషియా, థాయ్ లాండ్, దక్షిణకొరియా, ఇంగ్లండ్ నుంచి అమెరికా దాకా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఇంతగా ప్రేరేపించిన సన్నివేశం ఎప్పుడూ జరగలేదు. రామనామం దేశ ప్రజల్లో ఓ ఉత్తేజితం.. ప్రేరణగా నిలుస్తోంది.
గాంధీజీ రామరాజ్యాన్ని కలలుగన్నాడు. గాంధీ తుపాకీ గుళ్లకు నేలకొరుగుతూ అన్న చివరి మాట ‘హే రామ్’.. 1528లో బాబర్ రామాలయాన్ని నాశనం చేసిన తర్వాత.. తలపాగాలు తీసేసిన ఠాగూర్ లు.. 500 ఏళ్ల తర్వాత నిన్న తిరిగి ధరించారట.. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది 500 ఏళ్ల హిందువుల స్వప్నం.
యావత్ భారతావని ని ఒక్కటి చేసిన ‘రామ నామం’ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.