https://oktelugu.com/

Bangalore: ఇక భారత్‌ బ్రాండ్‌ విమానాలు.. మనకు దక్కే గొప్ప గౌరవం ఇదీ!

అమెరికా ఆ దేశం వెలుపల విమానాల తయారీకి తొలిసారి ముందుకు వచ్చింది. ఇందుకు భారత్‌ను ఎంచుకుంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, బోయింగ్‌ సంయుక్తంగా బోయింగ్‌ ఇండియా ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌(బీఐఈటీసీ) క్యాంపస్‌ను ప్రారంభించాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 20, 2024 / 01:45 PM IST

    Bangalore

    Follow us on

    Bangalore: ప్రపంచ వ్యాప్తంగా విమానాల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. రోడ్డు, రైలు మార్గాల డిమాండ్‌ పెరుగుతున్నట్లుగానే వేగవంతమైన ప్రయాణం కోసం విమానాలను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా విమానాల మార్కెట్‌ విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఇన్నాళ్లూ విమానాల తయారీకి అమెరికా, రష్యా, జపాన్‌పై ఆధార పడిన భారత్‌ ఇప్పుడు సొంతంగా తయారీపై దృష్టిపెట్టింది. అమెరికా సహకారంతో బోయింగ్‌ ఇండియా విమానాల తయారీకి ముందుకు వచ్చింది. ఈమేరకు బెంగళూరు సమీపంలో 43 ఎకరాల్లో రూ.1,600 కోట్లతో బోయింగ్‌ ఇండియా ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ను నిర్మించారు. అమెరికా వెలుపల నిర్మించిన అతిపెద్ద విమానాల తయారీ కేంద్రం ఇదే. దీనిని ప్రధాని మోదీ శుక్రవారం(జనవరి 19న) ప్రారంభించారు.

    ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో..
    అమెరికా ఆ దేశం వెలుపల విమానాల తయారీకి తొలిసారి ముందుకు వచ్చింది. ఇందుకు భారత్‌ను ఎంచుకుంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, బోయింగ్‌ సంయుక్తంగా బోయింగ్‌ ఇండియా ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌(బీఐఈటీసీ) క్యాంపస్‌ను ప్రారంభించాయి. మోదీ మేకిన్‌ ఇండియాలో భాగంగా దేశంలోని ఇది అతి శక్తివంతైమన స్టార్టప్‌. దీనిద్వారా విమానాల తయారీలో భారత్‌ అగ్రగామిగా మారుతుందని ప్రధాని ఆశాభావంతో ఉన్నారు.

    బీఐఈటీసీ అంటే..
    బీఐఈటీసీ అనేది భారతదేశంలో బోయింగ్‌ యొక్క కొత్త క్యాంపస్‌. విమానయానికి పెరుగుతున్న డిమాండ్‌తో భారతీయ విమానయాన సంస్థలు అనేక విమానాలకు ఆర్డర్‌ ఇస్తున్నాయి. దీనిని గుర్తించిన ప్రధాని మోదీ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. భారత దేశాన్నే విమానాల తయారీ మార్కెట్‌గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గ్లోబల్‌ ఏవియేషన్‌ మార్కెట్‌కు భారత్‌ను కేంద్రంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.