Jagan vs chandrababu: ఏపీ రాజకీయాలు మునుపెన్నడూ లేనంతా హాట్ హాట్ గా సాగుతున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రగిలించిన ఈ మంటలు ఏపీలో ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారాయి. మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఈ జ్వాలలు ఇప్పుడు దీక్షలు, అరెస్ట్ ల వరకూ వెళ్లాయి.

సీఎం జగన్ ను ఉద్దేశించి పట్టాభి చేసిన ‘ఓరేయ్ బోసిడీకే’ విమర్శలతో వైసీపీ బ్యాచ్ విరుచుకుపడింది. టీడీపీ కార్యాలయాలు , నేతల ఇళ్లను ధ్వంసం చేసేసింది. అనంతరం చంద్రబాబు దీన్ని పరిశీలించి అగ్గిరాజేశారు. తాజాగా వైసీపీ ధ్వంసం చేసిన మంగళగిరి టీడీపీ ఆఫీసులోనే 36 గంటల నిరసన దీక్షకు దిగారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ప్రతిబింబం అని.. దాడి జరిగిన చోటే దీక్షకు దిగి వైసీపీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏం చేయాలో చేసి చూపిస్తానంటూ చంద్రబాబు సవాల్ చేశారు.
మరో వైపు ఇదే టైంలో చంద్రబాబు దీక్షలకు మద్దతుగా వైసీపీ జనాగ్రహ దీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దిగింది. సీఎం జగన్ సైతం విజయవాడ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. చివరికి ముఖ్యమంత్రి తల్లిని ఉద్దేశించి టీడీపీ నేతలు బూతులు తిడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అనైతిక, అధర్మం అన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక అధికారంలోకి రాలేమని తేలిందని.. అందుకే రాష్ట్రంలో గొడవలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని జగన్ ఆరోపించారు. వీళ్లు దాడి చేస్తోంది.. ముఖ్యమంత్రి, ప్రభుత్వం మీద మాత్రమే కాదని.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం మీద దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక సీఎంను అభిమానించేవాళ్లు తిరగబడాలని జగన్ పిలుపునిచ్చాడు. భావోద్వేగాలు పెరగాలని వాల్లు ఆరాటపడుతున్నారని.. రాష్ట్రం పరువు తీసేలా విష ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు.
ఇలా చంద్రబాబు, జగన్ తగ్గేదేలే అంటూ ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందో.? వేచిచూడాలి.