Nara Lokesh: తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం విజృంభిస్తోంది. దీంతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటోంది. ఇలాగే పోతే రాబోయే రోజుల్లో వైసీపీకి కష్టకాలమే అని తెలుస్తోంది. ప్రజల్లో ఉంటూ ఉద్యమాలు చేస్తూ తన ప్రభావం చూపెట్టుకునేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. నిన్న జరిగిన పరిణామాలకు టీడీపీ స్థాయి మరింత పెరిగిందని చెబుతున్నారు. వైసీపీ మాత్రం తన పరువు తీసుకుందని తెలుస్తోంది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పంథా మార్చుకున్నారు. ప్రజా సమస్యలను టార్గెట్ చేస్తూ అధికార పార్టీ వైసీపీని ముప్పతిప్పలు పెట్టేందుకు తన శక్తియుక్తులు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వంపై పోరాడేందుకు సరైన వేదికగా సమస్యలు తీసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల సమస్య అయినా, హత్యలైనా ఏదైనా విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పరిష్కారానికి తనదైన ముద్ర వేస్తున్నారు.
ప్రజా సమస్యలపై పోరాడటంలో విజయాలు సాధిస్తూ టీడీపీ ముందుకెళ్తోంది. నారా లోకేష్ సీనియర్లతో కలిసి అంతర్గత విభేదాలు పక్కనపెట్టి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటం కొనసాగిస్తున్నారు. దీంతో తన ఇమేజ్ పెంచుకుంటున్నారు. ప్రజల్లో పరపతి రెట్టింపు చేసుకుంటున్నారు.
నిన్న జరిగిన పరిణామాలతో టీడీపీకే ఎక్కువ ప్రయోజనం కలిగినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల గొడవతో వివాదం ముదిరి దాడులకు వరకు వెళ్లిపోయింది. కానీ వైసీపీ తొందరపాటుకు టీడీపీ మాత్రం తొందరపడలేదు. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడం వెనుక వైసీపీ నేతల దుడుకు చర్య మాత్రం ఉండగా టీడీపీ ముందుచూపుతో వ్యవహరించందని తెలుస్తోంది. ప్రజల్లో తన పట్టు పెంచుకుందని పలువురు విశ్లేషిస్తున్నారు.