Tamil Nadu Politics: దక్షిణాదిలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఉత్తరాదిలో తన ప్రభావం చూపుతున్నా దక్షిణాదిలో మాత్రం కర్ణాటక తప్ప ఇతర రాష్ర్టం దానికి అనుకూలంగా లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ తన మనుగడ పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే పలు వ్యూహాలు రచిస్తోంది. ఇన్నాళ్లు ఉత్తరాదికే ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ ఈ మధ్య దక్షిణాదిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తెలుగు ప్రాంతాల్లో కూడా తన బలం చూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీని ఎన్డీయేలో చేరాల్సిందిగా పలు సూచనలు వస్తున్నాయి. దీనిపై జగన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇన్నాళ్లు బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న జగన్ ఎన్డీయే కూటమిలో చేరతారో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా బీజేపీ ప్రభావం పెంచుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. హుజురాబాద్ లో గెలిచి టీఆర్ఎస్ కు సవాలు విసరాలని భావిస్తోంది.
తమిళనాడులో కూడా బీజేపీ ఉనికి చాటుకోవాలని చూస్తోంది. దీనికోసం అన్నాడీఎంకేను దగ్గర చేసుకోవాలని భావిస్తోంది. ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్న శశికళను రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాదిలో కూడా బీజేపీకి బలం కావాలని ఆశిస్తోంది. ఉత్తరాది బలంతో పాటు దక్షిణాదిలో కూడా పట్టు సాధిస్తే పార్టీకి మరింత ప్రయోజనం కలుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇందులో భాగంగానే శశికళను బీజేపీలో చేరాలని సూచిస్తున్నారు. ఇందుకోసం పన్నీర్ సెల్వంను కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. పళని స్వామిని బలహీనం చేసి శశికళ స్థాయిని పెంచేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందుకోసం వ్యూహాలు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అందుకే తమిళనాడులో కూడా పట్టు సాధించాలని బీజేపీ కలలు కంటోంది. దీని కోసం అన్ని దారులు వెతుకుతోంది.