Jagan & Chandrababu Shocked On Pawan Kalyan Ippatam : ఇప్పటం సంఘటనతో ఏపీ సీఎం జగన్ షాక్ కు గురయ్యాడు. చంద్రబాబు కూడా అవాక్కయ్యాడు. పవన్ కళ్యాణ్ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. ఆయన ప్లాన్లకు ప్రత్యర్థులు విలవిలలాడుతున్నారు. కాలం కలిసి రాకపోతే తాడే పాము అయ్యి కరుస్తుందంటారు. ఇవ్వాళ జగన్ పరిస్థితి అలాగే తయారైంది.
చంద్రబాబుపై ఒంటికాలిపై లేచే జగన్.. ఇవాళ పవన్ కళ్యాణ్ ను ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. విశాఖ ఘటన, జనస్పందనతో జగన్ అవాక్కవుతున్నాడు. ఇప్పటంతో జగన్ కు భారీ దెబ్బ తగిలింది.
ఈ రెండు ఘటనల తర్వాత జవాబు చెప్పుకోలేని దిక్కుతోచని స్థితికి జగన్ దిగజారాడు. ఇప్పుడు వైసీపీ ఫోకస్ అంతా జనసేన-పవన్ కళ్యాణ్ వైపు మళ్లింది. జగన్ కు వ్యతిరేకంగా ఆలోచించే వారు పవన్ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకులు కూడా పవన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇవాళ ఆంధ్రా ప్రజానీకం 2014లో చూసిన దానికి భిన్నంగా చూస్తున్నారు.
మొదట్లో అంతగా ఆదరణ చూపని జనం.. ఇటీవల సంఘటనల్లో పవన్ స్పందిస్తున్న తీరు చూస్తుంటే.. పవన్ ను ఏపీ రాజకీయాల్లో విస్మరించని రాజకీయ శక్తిగా మారాడని అందరూ గుర్తించారు. పవన్ కళ్యాణ్ ప్లాన్లు.. ఇప్పటం ఘటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.